Telugu Global
Science and Technology

పెరుగుతున్న సైబర్ నేరాలు.. తాజాగా ఏఐ స్కామ్‌లు!

దేశంలో జరుగుతున్న సైబర్ మోసాల్లో క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఎక్కువగా ఉన్నాయి.

పెరుగుతున్న సైబర్ నేరాలు.. తాజాగా ఏఐ స్కామ్‌లు!
X

సైబర్ మోసాలపై అవేర్‌‌నెస్ ఎంత పెరుగుతున్నా మోసాల సంఖ్య మాత్రం తగ్గట్లేదని రిపోర్ట్‌లను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మూడేళ్లలో సుమారు 12 వేల సైబర్‌ మోసాలు జరిగాయట. దాదాపు రూ.461 కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లింది. ముఖ్యంగా ఎలాంటి సైబర్ మోసాలు కామన్‌గా జరుగుతున్నాయంటే..

దేశంలో జరుగుతున్న సైబర్ మోసాల్లో క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సరైన సెక్యూరిటీ, పాస్‌వర్డ్‌లు మెయింటెయిన్ చేయకపోవడం వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దీంతోపాటు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏఐ టూల్స్‌ ద్వారా కూడా పలు రకాల మోసాలు అమలుచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

రీసెంట్‌గా జరిగిన పలు సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా జరిగిన మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ నిర్వహించిన ‘ది ఆర్టిఫిషియల్ ఇంపోస్టర్’ సర్వేలో సుమారు 47 మంది భారతీయులు ఏఐ వాయిస్ స్కామ్‌లను ఎదుర్కొన్నట్లు తెలిసింది. వీరిలో చాలామంది రూ.50,000 కంటే ఎక్కువ నష్టపోయారని రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది.

ఏఐ టెక్నాలజీతో చేసే ఫేక్ రోబో కాల్స్ స్కామ్ ఇటీవలికాలంలో ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ట చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని అని ఒకరు మీతో చెప్తే అది నిజమైన వ్యక్తి కాకపోవచ్చని తెలుసుకోవాలి. పర్సనల్ వివరాలను షేర్ చేసుకోకుండా జాగ్రత్తపడాలి.- లింక్స్‌ను క్లిక్ చేయకూడదు. సంస్థల పేరుమీద వచ్చే కాల్స్/మెసేజ్‌లను కూడా అనుమానించాల్సిందే. అవసరమైతే స్కామ్ కాల్స్ లేదా ఇతర స్పామ్‌ మెయిల్స్‌/మెసేజ్‌లపై నేషనల్ హెల్ప్‌లైన్ ‘155260’ కు కంప్లెయింట్ చేయొచ్చు.

First Published:  23 Dec 2023 6:30 AM GMT
Next Story