Telugu Global
Science and Technology

ఫ్యూచర్లో మొబైల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి!

మొబైల్స్‌ను జనరేటివ్ ఏఐ డివైజ్‌లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మొబైల్స్ అన్నీ రకరకాల ఏఐ ఫీచర్లతో ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఫ్యూచర్లో మొబైల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి!
X

చూస్తుండగానే మొబైళ్ల టెక్నాలజీ కూడా మారిపోతోంది. కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ వంటి ఫీచర్లు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీ అయిన ఏఐ పై పనిచేస్తున్నాయి. మొబైల్స్‌ను జనరేటివ్ ఏఐ డివైజ్‌లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మొబైల్స్ అన్నీ రకరకాల ఏఐ ఫీచర్లతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం ఏయే మొబైళ్లలో ఎలాంటి ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఐ బేస్డ్ మొబైల్స్‌లో గూగుల్, శాంసంగ్ బ్రాండ్‌లు ముందువరుసలో ఉన్నాయి. గూగుల్‌ రీసెంట్‌గా లాంఛ్ చేసిన ‘పిక్సెల్‌ 8’ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్లను అందిచింది. వాటిలో రియల్ టైం ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా ఒకటి. అంటే లైవ్‌లో వాయిస్ ప్లే అవుతుండగా మనకు నచ్చిన భాషలో వాయిస్ ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు. అలాగే యూజర్ల యూసేజీని బట్టి బ్యాటరీ ఛార్జింగ్‌ వేగం మారేలా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా పిక్సెల్ 8 ఫోన్‌లో ఉంది. వీటితో పాటు గూగుల్ బార్డ్, గూగుల్ జెమినీ వంటి ఏటై టూల్స్‌ను కూడా డైరెక్ట్‌గా పిక్సెల్ ఫోన్స్‌లో పొందొచ్చు.

ఇక శాంసంగ్ బ్రాండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్లను తమ ‘గెలాక్సీ ఎస్‌ 24 అల్ట్రా’ మోడల్‌లో పరిచయం చేసింది. ఈ మొబైల్‌లో రియల్ టైం వాయిస్ ట్రాన్స్‌లేషన్ తో పాటు సర్కిల్ టు సెర్చ్ అనే మరో ఇంట్రెస్టింగ్ టూల్ అందుబాటులో ఉంది. ఈ టూల్ ద్వారా స్క్రీన్ పై కనిపిస్తున్న ఏ వస్తువు మీదైనా సర్కిల్ చుడితే ఆ వస్తువు వివరాలను సెర్చ్ చేసి చూపిస్తుంది. ఉదాహరణకు ఒక సినిమా చూస్తున్నప్పుడు హీరో ధరించిన టోపీ గురించి తెలుసుకోవాలంటే దానిపై రౌండ్‌గా ఒక సర్కిల్ గీస్తే చాలు. ఏఐ సెర్చ్ ద్వరా దాని వివరాలు తెలిసిపోతాయి.

ఇకపోతే గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మొబైల్ కెమెరాలో లైవ్‌లోనే ఫొటో బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, షార్ట్ వీడియోలు రెడీ చేయడం వంటి పలు ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రజెంటేషన్స్ రెడీ చేయడం, టుడు లిస్ట్ రెడీ చేయడం వంటి డైలీ లైఫ్, ఆఫీస్ వర్క్ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్లు రాబోయే మొబైల్స్‌లో కనిపించనున్నాయి. ప్రస్తుతం అన్ని మొబైల్ బ్రాండ్‌లు అన్నిరకాల ఫీఛర్లను అందిస్తుండడంతో ఏఐ ఫీచర్లే ఫ్యూచర్‌‌లో గేమ్ ఛేంజర్స్‌గా మారనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

First Published:  15 Feb 2024 12:15 PM GMT
Next Story