Telugu Global
Science and Technology

మొబైల్ డేటా ఎక్కువరోజులు రావాలంటే..

మొబైల్‌లో డేటా అయిపోయి ఇంటర్నెట్ వాడలేక ఇబ్బందిపడే వాళ్లు చాలామంది ఉంటారు. వీడియోలు చూడకపోయినా, డౌన్‌లోడ్లు చేయకపోయినా మొబైల్ డేటా ఎందుకు అయిపోతుందో తెలియక సతమతమవుతుంటారు.

Mobile Data: మొబైల్ డేటా ఎక్కువరోజులు రావాలంటే..
X

Mobile Data: మొబైల్ డేటా ఎక్కువరోజులు రావాలంటే..

మొబైల్‌లో డేటా అయిపోయి ఇంటర్నెట్ వాడలేక ఇబ్బందిపడే వాళ్లు చాలామంది ఉంటారు. వీడియోలు చూడకపోయినా, డౌన్‌లోడ్లు చేయకపోయినా మొబైల్ డేటా ఎందుకు అయిపోతుందో తెలియక సతమతమవుతుంటారు. అయితే మొబైల్‌లో ఉండే కొన్ని సెట్టింగ్స్ ను మార్చుకోకపోవడం వల్ల డేటా ఆటోమెటిక్‌గా ఖర్చు అవుతుంటుంది. కొన్ని చిన్నచిన్న టెక్నిక్స్‌తో మొబైల్ డేటాను సేవ్ చేయొచ్చు. అదెలాగంటే..

మొబైల్‌లో డేటాను ఎక్కువగా వాడుకునేవి యాప్స్. కాబట్టి ఏయే యాప్స్ ఎంత డేటా వాడుకుంటున్నాయో తెలుసుకోవాలి. దానికోసం డేటా యూసేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లొచ్చు. డేటా ఎక్కువగా వాడుకుంటున్న యాప్స్‌ను గుర్తించి వాటి వాడకాన్ని తగ్గించాలి. అలాగే కొన్ని యాప్స్ ఓపెన్ చేయకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను వాడుకుంటూనే ఉంటాయి. కాబట్టి అవసరం లేదనుకున్న యాప్స్‌కు బ్రాక్‌గ్రౌండ్ యూసేజ్ లిమిట్‌ను సెట్ చేయాలి. లేదా పూర్తిగా ఆఫ్ చేయాలి.

ఇకపోతే యాప్స్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అవుతుండడం వల్ల కూడా చాలా డేటా ఖర్చువుతుంటుంది. కాబట్టి ప్లే స్టోర్‌‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లో ‘నెట్వర్క్ ప్రిఫరెన్స్’ లో ‘యాప్ డౌన్‌లోడ్ ప్రిఫరెన్సెస్’ దగ్గర ‘ఆటో అప్‌డేట్ యాప్స్’పై క్లిక్ చేయాలి. అక్కడ ‘డోంట్ ఆటో అప్‌డేట్ యాప్స్’ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.

గూగుల్ డ్రైవ్, యాపిల్ క్లౌడ్ లాటి యాప్స్‌కు ఆటో సింకింగ్ ఆన్ చేసినా.. ‘ఓన్లీ విత్ వైఫై’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే మొబైల్ డేటా ఖర్చు అవ్వకుండా ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ వాడేటప్పుడు లొకేషన్, రూట్ మ్యాప్‌ లోడ్ అయ్యేందుకే డేటా కావాలి. కానీ, ఆ తర్వాత నేవిగేషన్ కోసం డేటా అవసరం లేదు. కాబట్టి మ్యాప్‌లో రూట్ సెట్ చేసుకున్నాక మొబైల్ డేటా ఆఫ్ చేసి కూడా మ్యా్ప్స్ వాడొచ్చు.

యూట్యూబ్‌లో సినిమాలు లాంటివి మినహాయించి టీవీ షోలు, మామూలు వీడియోలు చూసేటప్పుడు క్వాలిటీ ‘ఆటో’లో కాకుండా ‘480పీ’ లేదా ‘720 పీ’ పెట్టుకుంటే చాలావరకూ డేటా సేవ్ అవుతుంది.

First Published:  27 Feb 2023 1:57 PM GMT
Next Story