Telugu Global
Science and Technology

ఎక్స్ (ట్విటర్) లో కొత్త కాలింగ్ ఫీచర్లు!

ఎక్స్(ట్రిటర్) యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో, ఆడియో కాలింగ్ ఫీచర్లు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నాయి.

ఎక్స్ (ట్విటర్) లో కొత్త కాలింగ్ ఫీచర్లు!
X

ఎక్స్ (ట్విటర్) లో కొత్త కాలింగ్ ఫీచర్లు!

ఎక్స్(ట్రిటర్) యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో, ఆడియో కాలింగ్ ఫీచర్లు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయి? ఏయే యూజర్లకు అందుబాటులో రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రీసెంట్‌గా ఎక్స్ సంస్థ.. తన సపోర్ట్ పేజీలో ‘ఎక్స్‌లో ఆడియో, వీడియో కాలింగ్‌ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి కొత్త ఆప్షన్‌ను విడుదల చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇది ఐఓఎస్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లకు విడుదలవుతుంది’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి ఐఓఎస్ డివైజ్‌ల్లో ఎక్స్ ప్రీమియం (ట్విట్టర్ బ్లూ) యూజర్లకు వీడియో, ఆడియో కాలింగ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ద్వారా ప్రీమియం యూజర్లు కాల్స్ చేయొచ్చు. సాధారణ ఎక్స్ యూజర్లు కాల్స్‌ స్వీకరించొచ్చు. కానీ కాల్స్ చేయడం కుదరదు.

ఈ ఫీచర్ ఎనేబుల్ కావాలంటే ముందుగా కాల్ చేయదలుచుకున్న ఇద్దరు యూజర్లు కనీసం ఒక్కసారైనా డైరెక్ట్ మెసేజ్‌లను పంపుకోవాలి. కాల్స్ చేయాలనుకునేవాళ్లు ‘డైరెక్ట్ మెసేజెస్’లోకి వెళ్లి సదరు యూజర్ చాట్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్ కింద ఉన్న ఫోన్ ఐకాన్‌పై నొక్కితే- ‘ఆడియో కాల్’, ‘వీడియో కాల్’ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. నచ్చిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

కాల్స్‌ రావొద్దు అనుకునేవాళ్లు సెట్టింగ్స్ మార్చుకునేందుకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్ యాప్‌లో ‘డైరెక్ట్ మెసేజింగ్’ సెక్షన్‌కు వెళ్లి.. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న ‘సెట్టింగ్స్‌’లోకి వెళ్తే అక్కడ కాలింగ్‌కు సంబంధించిన ప్రైవసీ ఆప్షన్లు కనిపిస్తాయి. కాలింగ్ ఫీచర్‌ను పూర్తిగా ఆఫ్ చేసుకోవచ్చు. లేదా ఎవరెవరు కాల్స్ చేయాలో ఎంపిక చేసుకోవచ్చు.

ఇకపోతే ఎక్స్‌ను టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా రూపొందించేందుకు మస్క్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాలింగ్ ఆప్షన్లతో పాటు మరిన్ని కమ్యూనికేషన్ ఆప్షన్స్, నెట్‌వర్కింగ్ ఫీచర్స్, జాబ్ సెర్చింగ్.. ఇలా అన్నిరకాల ఫీచర్లు యాడ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. త్వరలోనే ఎక్స్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు ఆశించొచ్చు.

First Published:  28 Oct 2023 12:52 PM GMT
Next Story