Telugu Global
Science and Technology

పీసీలో మొబైల్ వాడాలంటే ఇలా..

కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌పై పనిచేసేటప్పుడు మాటిమాటికీ మొబైల్ తెరిచే పనిలేకుండా మొబైల్ స్క్రీన్‌ను నేరుగా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా చేయొచ్చు.

How to use mobile on PC
X

పీసీలో మొబైల్ వాడాలంటే ఇలా..

కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌పై పనిచేసేటప్పుడు మాటిమాటికీ మొబైల్ తెరిచే పనిలేకుండా మొబైల్ స్క్రీన్‌ను నేరుగా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా చేయొచ్చు. అదెలాగంటే..

కంప్యూటర్ స్క్రీన్‌పై మొబైల్ స్క్రీన్ కనిపించాలంటే కంప్యూటర్‌‌లో ‘ఎస్‌సీఆర్‌సీపీవై’ అనే సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో యూఎస్‌బీ ద్వారా కంప్యూటర్ స్క్రీన్ మీద ఫోన్‌ వాడుకోవచ్చు.

ముందుగా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి ‘ఎస్‌సీఆర్‌సీపీవై డౌన్‌లోడ్’ అని టైప్ చేస్తే ‘గిట్ హబ్’ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి మీ ఓఎస్‌ వెర్షన్‌ను బట్టి సాఫ్ట్‌వేర్‌‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్‌లో ‘ఎయిర్ డ్రాయిడ్’ అనే యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. మొబైల్‌లోని ఎయిర్ డ్రాయిడ్ యాప్‌లో ‘మీ’ సెక్షన్ లో ‘సెక్యూరిటీ అండ్‌ రిమోట్‌ ఫీచర్స్‌’లోకి వెళ్లాలి. అక్కడ ‘స్క్రీన్‌ మిర్రరింగ్‌’ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.

యూఎస్‌బీ కేబుల్‌తో ఫోన్‌ను, పీసీని కనెక్ట్‌ చేయాలి. అలాగే ఫోన్‌లో యూఎస్‌బీ డీబగింగ్‌ మోడ్‌ ఎనేబుల్‌ చేసి ఉండాలి. తర్వాత పీసీలో ‘ఎస్‌సీఆర్‌సీపీవై’ యాప్‌ను రన్‌ చేయాలి. దీంతో పీసీ మీద ఫోన్‌ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది.

ఫోన్‌లో చేసే పనులు పీసీలో కనిపిస్తాయి. కంప్యూటర్ మౌస్‌తోనే ఫోన్‌ను ఆపరేట్ చేయొచ్చు. ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌‌లో ‘ఎయిర్‌డ్రాయిడ్‌ వెబ్‌’ వాడడం ద్వారా మొబైల్‌ను వైర్‌‌లెస్‌గా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇందులో ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌, కాంటాక్ట్‌ కాపీ, రిమోట్‌ టెక్స్టింగ్‌, బ్యాకప్స్‌ వంటి ఎన్నో ఇతర ఫీచర్లు ఉంటాయి.

First Published:  16 March 2023 6:19 AM GMT
Next Story