Telugu Global
Science and Technology

గూగుల్ మ్యాప్స్‌లో స్టోరీ టెల్లింగ్ ఫీచర్ గురించి తెలుసా?

మీరు గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే అందులో ఉన్న స్టోరీ టెల్లింగ్ ఫీచర్‌‌ను ఎప్పుడైనా గమనించారా? మీ మెమరీస్‌ను ఇతరులతో పంచుకునేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌లో ‘క్రియేట్ స్టోరీ’ అనే ఫీచర్ ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్‌లో స్టోరీ టెల్లింగ్ ఫీచర్ గురించి తెలుసా?
X

మీరు గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే అందులో ఉన్న స్టోరీ టెల్లింగ్ ఫీచర్‌‌ను ఎప్పుడైనా గమనించారా? మీ మెమరీస్‌ను ఇతరులతో పంచుకునేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌లో ‘క్రియేట్ స్టోరీ’ అనే ఫీచర్ ఉంటుంది. ఇదెలా పనిచేస్తుందంటే..

ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకుంటుంటారు. గూగుల్ మ్యాప్స్.. మీరు తిరిగిన ప్రదేశాలన్నీ రికార్డ్ చేస్తుంది. వాటన్నింటినీ టైమ్‌లైన్ రూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపిస్తుంది. అయితే ఎప్పుడైనా మీరు తిరిగిన ప్రదేశాల్లోని అనుభవాలను నెమరువేసుకోవాలనుకున్నా.. మీ ప్రయణ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలనుకున్నా టైమ్‌లైన్ కింద ఉండే ‘క్రియేట్ స్టోరీ’ ఫీచర్‌‌పై క్లిక్ చేసి స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్.. మీరు వెళ్లిన లొకేషన్స్, టైం, ఫోటోలు, వీడియోలు, మీరు రాసిన కొటేషన్స్‌ను ఒకచోట చేర్చి దానికి ఒక థీమ్, లుక్ జత చేసి మంచి విజ్యువల్ స్టోరీలాగా తయారుచేస్తుంది. జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఈ ఫీచర్ పనికొస్తుంది. ఈ ఫీచర్‌‌ను ఎలా యాక్సెస్ చేయొచ్చంటే..

ముందుగా గూగుల్ మ్యాప్స్‌లో ప్రొఫైల్ పిక్చర్‌‌పై క్లిక్ చేసి ‘యువర్ టైమ్‌లైన్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద కనిపించే ‘+’ సింబల్‌పై క్లిక్ చేస్తే.. ‘క్రియేట్ స్టోరీ’ అని కనిపిస్తుంది. అక్కడ టైటిల్ రాసి స్టోరీ క్రియేట్ చేయొచ్చు. ముందుగా యాడ్ లొకేషన్ లోకి వెళ్లి అక్కడ మీరు వెళ్లిన ప్రదేశాలను మ్యాప్‌లో సెలక్ట్ చేసుకోవాలి. ప్రతి లొకేషన్‌కు కొన్ని ఫోటోలు లేదా వీడియోలు జత చేయాలి. వాటికి క్యాప్షన్స్ వంటివి కూడా రాసుకోవచ్చు. అలా ప్లేసులు, ఫొటోలు, వీడియోలు, క్యా్ప్షన్స్ క్రియేట్ చేసి.. థీమ్, ఫాంట్, మ్యూజిక్ సెలక్ట్ చేసుకుంటే స్టోరీ వీడియో రెడీ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని షేర్ కూడా చేసుకోవచ్చు.

First Published:  18 Dec 2023 4:47 AM GMT
Next Story