Telugu Global
Science and Technology

విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..

DigiYatra App: విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది.

విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..
X

విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది. ఇదెలా పనిచేస్తుందంటే..

ఎంపిక చేసిన మూడు విమానాశ్రయాలలో డిజిటల్‌ బోర్డింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అదే.. డిజియాత్ర. ఇది పేపర్‌‌లెస్ వెరిఫికేషన్, అవాంతరాలు లేని ప్రయాణాన్ని అందించేందుకు తీసుకొచ్చిన యాప్. ముందుగా ప్రయాణికులు డిజియాత్ర యాప్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తమ అకౌంట్, ఫేస్ ఐడీని, బయోమెట్రిక్ డేటాను కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇలా వివరాలు సేవ్ చేసుకుంటే ఎయిర్ పోర్ట్ లో చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్, ఎయిర్‌క్రాఫ్ట్ బోర్డింగ్ సమయంలో ప్రయాణీకుల వివరాలు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.

ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, వారణాసిలో విమానాశ్రయాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. మార్చి 2023 నాటికి హైదరాబాద్, కోల్‌కతా, పూణె విమానాశ్రయాల్లో డిజియాత్ర అందుబాటులోకి రానుంది.

ఫేస్ ఐడీ ఇలా క్రియేట్ చేసుకోవాలి

ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లో డిజియాత్ర ఫౌండేషన్ వెబ్‌సైట్ ద్వారా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

తర్వాత ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌ ఉపయోగించి రిజిస్టర్ అవ్వాలి.

తర్వాత ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. సెల్ఫీ ఫోటో తీసుకుని ఫేస్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.

తర్వాత ప్రయాణించబోయే విమాన వివరాలను ఎంటర్ చేయాలి. బోర్డింగ్ పాస్ డేటాను కూడా అప్‌డేట్ చేయాలి.

ఇలా డిజియాత్ర ఐడీని క్రియేట్ చేసిన తర్వాత, విమానాశ్రయంలోని రిజిస్ట్రేషన్ కియోస్క్‌కి వెళ్లి ఆధార్ వివరాలు ఎంటర్ చేస్తే.. వెరిఫికేషన్ అంతా ఆన్‌లైన్‌లో అయిపోతుంది.

First Published:  6 Dec 2022 11:44 AM GMT
Next Story