Telugu Global
Science and Technology

ఫేక్ వెబ్‌సైట్ లింక్స్‌ను ఇలా కనిపెట్టండి!

నకిలీ వెబ్‌సైట్స్ ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్నవాళ్లు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నారు.

ఫేక్ వెబ్‌సైట్ లింక్స్‌ను ఇలా కనిపెట్టండి!
X

ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేవాళ్లు తరచూ బోలెడు వెబ్‌సైట్స్‌ను విజిట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు తెలియక ఫేక్ వెబ్‌సైట్స్ బారిన పడే అవకాశం ఉంది. అచ్చం ఒరిజినల్ వెబ్‌సైట్‌లా కనిపించే ఈ నకిలీ వెబ్‌సైట్స్‌ను ఎలా గుర్తించొచ్చంటే..

నకిలీ వెబ్‌సైట్స్ ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్నవాళ్లు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సైట్స్, షాపింగ్ సైట్స్ కేటగిరీల్లో ఈ తరహా నకిలీ సైట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటికి లాగిన్ అవ్వడం ద్వారా సిస్టమ్ హ్యాక్ అవ్వడమే కాక పర్సనల్, బ్యాంకింగ్ డీటెయిల్స్ వంటివి రిస్క్‌లో పడతాయి. అందుకే వెబ్‌సైట్ ఓపెన్ చేసేముందు కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి.

ఏదైనా వెబ్​సైట్ ఓపెన్ చేసేముందు ముందుగా దాని డొమైన్ అడ్రెస్‌ను చెక్ చేసుకోవాలి. వెబ్​సైట్ యూఆర్‌‌ఎల్‌కు ముందు ‘హెచ్‌టీటీపీ(http)’ అని ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. అలాగే అడ్రెస్ చివర్లో ‘డాట్‌కామ్(. com), డాట్ ఓఆర్‌‌జీ(.org), డాట్‌ఇన్(.in) వంటి కామన్ డొమైన్స్ ఉన్నాయో, లేదో చూసుకోవాలి.

వెబ్‌సైట్ ఓపెన్ చేశాక ఏది క్లిక్ చేసినా వెంటనే వేరొక వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంటే అది ఒరిజినల్ సైట్ కాదని తెలుసుకోవాలి. అలాగే నకిలీ వెబ్‌సైట్స్‌లో ‘కాంటాక్ట్ అజ్’ లేదా ‘అబౌట్ అజ్’ వంటి ఆప్షన్లు కనిపించవు.

ఇక వీటితోపాటు వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ లేదా పేమెంట్స్ వంటివి చేసేముందు ఆ వెబ్‌సైట్స్‌కు సంబంధించిన రివ్యూలు చదవడం మంచిది. అసలైన వెబ్‌సైట్ అడ్రెస్ తెలుసుకుని ఒకటికి రెండు సార్లు వెబ్ అడ్రెస్ స్పెల్లింగ్‌ను చెక్ చేసుకోవాలి.

ఇకపోతే వెబ్ బ్రౌజర్‌‌లో ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేక్ వెబ్‌సైట్స్‌ను ఈజీగా గుర్తించే వీలుంటుంది. లేదా ‘వెబ్ ఆఫ్ ట్రస్ట్(web of trust)’ అనే వెబ్​సైట్‌లో అడ్రెస్ టైప్ చేసి కూడా అది ఒరిజినల్ అవునా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు.

First Published:  29 Feb 2024 7:15 AM GMT
Next Story