Telugu Global
Science and Technology

ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే..

Phone Battery Last Longer: ఫోన్లలో త్వరగా బ్యాటరీ అయిపోవడం చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. మొబైల్ కొన్న కొత్తలో బ్యాటరీ బాగానే వస్తుంది. కానీ పోనుపోను బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. దాంతో చాలామంది మొబైల్స్‌ను మార్చేస్తుంటారు.

ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే..
X

ఫోన్లలో త్వరగా బ్యాటరీ అయిపోవడం చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. మొబైల్ కొన్న కొత్తలో బ్యాటరీ బాగానే వస్తుంది. కానీ పోనుపోను బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. దాంతో చాలామంది మొబైల్స్‌ను మార్చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో మొబైల్ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే యాప్స్ వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వేస్ట్ అవుతుంటుంది. అందుకే సోషల్‌ మీడియా యాప్స్‌ వాడిన తర్వాత వాటిని క్లోజ్ చేసి, డేటా ఆఫ్ చేయాలి. నోటిఫికేషన్స్, అప్‌డేట్స్ లాంటివి వస్తున్నంతసేపు యాప్ రన్ అవుతున్నట్టే లెక్క. కాబట్టి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వకుండా చూసుకోవాలి.

బ్యాక్‌గ్రౌడ్‌ డేటా యూసేజ్‌ను పరిమితం చేసుకోవడం ద్వారా బోలెడంత బ్యాటరీని సేవ్ చేయొచ్చు. దీనికోసం సెట్టింగ్స్‌లో డేటా యూసేజ్ లిమిట్‌ను సెట్ చేసుకోవాలి.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి యాప్స్‌కు లైట్ వెర్షన్స్‌ కూడా దొరుకుతున్నాయి. సోషల్ మీడియాను తక్కువగా వాడేవాళ్లు లైట్ వెర్షన్ యాప్స్ వాడడం ద్వారా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు.

మొబైల్ స్క్రీన్‌ను డార్క్ లేదా నైట్ మోడ్‌లో సెట్ చేయడం ద్వారా స్క్రీన్ లైటింగ్ తగ్గి, బ్యాటరీ ఎక్కువసేపు వచ్చేలా చేస్తుంది. అలాగే ఆటో బ్రైట్‌నెస్ ఆప్షన్ కూడా బ్యాటరీ సేవ్‌ చేస్తుంది.

ఎప్పుడైనా ఫోన్‌ను ఛార్జ్ చేసేటప్పుడు వంద శాతం బ్యాటరీ వచ్చేవరకూ ఉంచాలి. అలాగే ఫోన్‌లో బ్యాటరీ ఇరవై శాతం కంటే తక్కువకి పడిపోయినప్పుడు వెంటనే ఛార్జ్ చేయాలి. బ్యాటరీ పది శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు మొబైల్ వాడితే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంది.

ఇకపోతే మొబైల్‌కు చార్జ్ చేసేటప్పుడు కంపెనీ ఇచ్చిన అడాప్టర్, కేబుల్‌నే వాడాలి. ఇతర అడాప్టర్‌‌లు వాడడం వల్ల బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది.

First Published:  1 Nov 2022 11:50 AM GMT
Next Story