Telugu Global
Science and Technology

Threads-Twitter | ట్విట్ట‌ర్ వ‌ర్సెస్ థ్రెడ్స్‌.. ఇవీ రెండు యాప్స్‌లో తేడాలు..!

Threads-Twitter | ఎల‌న్‌మ‌స్క్ సార‌ధ్యంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ `ట్విట్ట‌ర్‌`కు.. గ‌ట్టి పోటీదారుగా మెటా `థ్రెడ్స్‌` వ‌చ్చేసింది.

Threads-Twitter | ట్విట్ట‌ర్ వ‌ర్సెస్ థ్రెడ్స్‌.. ఇవీ రెండు యాప్స్‌లో తేడాలు..!
X

Threads-Twitter | ట్విట్ట‌ర్ వ‌ర్సెస్ థ్రెడ్స్‌.. ఇవీ రెండు యాప్స్‌లో తేడాలు..!

Threads-Twitter | ఎల‌న్‌మ‌స్క్ సార‌ధ్యంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ `ట్విట్ట‌ర్‌`కు.. గ‌ట్టి పోటీదారుగా మెటా `థ్రెడ్స్‌` వ‌చ్చేసింది. ట్విట్ట‌ర్ మాదిరిగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సృష్టించిన `థ్రెడ్స్‌`.. టెక్ట్స్ బేస్డ్ యాప్‌. అయినా రెండింటిలో కొన్ని విభిన్న ఫీచ‌ర్లు ఉన్నాయి.. అవేమిటో ఓ లుక్కేద్దాం.. !

మెటా `థ్రెడ్స్‌` త‌న యూజ‌ర్లు మెసేజ్ పంప‌డానికి 500-క్యార‌క్ట‌ర్ల లిమిట్ విధించింది. మ‌రోవైపు అన‌ధికార ట్విట్ట‌ర్ యూజ‌ర్లు గ‌రిష్టంగా 280 క్యార‌క్ట‌ర్ల టెస్ట్ మెసేజ్ పంప‌డానికి అనుమ‌తి ఇస్తున్నది. ధృవీకృత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా యూజ‌ర్ థ్రెడ్స్ ఖాతాకు బ్లూ బ్యాడ్జి య‌థాత‌థంగా కొన‌సాగిస్తుంది.

ట్విట్ట‌ర్ ప్ర‌తి నెలా 8 డాల‌ర్ల స‌బ్‌స్క్రిప్ష‌న్ క‌ల్పించింది. స‌బ్‌స్క్రిప్ష‌న్ క‌ల యూజ‌ర్లు 25 వేల క్యార‌క్ట‌ర్ల వ‌ర‌కు టెక్ట్స్ మెసేజ్ పంప‌వచ్చు.

మెటా `థ్రెడ్స్‌`లో అటువంటి ఆప్ష‌నేం లేదు. థ్రెడ్స్ యూజ‌ర్లు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క‌లిగి ఉండాలి. ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్న‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయ‌ర్ల డేటా య‌ధాత‌థంగా ఇంపోర్ట్ అవుతుంది. దీనివ‌ల్ల ఇన్‌స్టాగ్రామ్‌కు గ‌ల భారీ యూజ‌ర్ల పునాదిని `థ్రెడ్స్‌` పొందేందుకు అనుకూలంగా ఉంటుంది.

థ్రెడ్స్ (అన్‌వెరిఫైడ్‌) యూజ‌ర్లు ఐదు నిమిషాల నిడివి గ‌ల వీడియోలు పోస్ట్ చేయొచ్చు. కానీ, ట్విట్ట‌ర్‌లో `బ్లూ బ్యాడ్జి` లేని యూజ‌ర్లు కేవ‌లం 2.20 నిమిషాల నిడివి గ‌ల వీడియోలు మాత్ర‌మే పోస్ట్ చేయ‌డానికి అనుమ‌తిస్తుంది.

ట్విట్ట‌రీలు.. ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌, యూజ‌ర్లకు ఆస‌క్తి గ‌ల టాపిక్స్ వీక్షించ‌డానికి ట్విట్ట‌ర్ హోం పేజీ అనుమ‌తి ఇస్తుంది. థ్రెడ్స్‌లో హోంఫీడ్ స్క్రోలింగ్ ద్వారా మాత్ర‌మే ట్రెండింగ్‌, యూజ‌ర్ల‌కు ఇష్ట‌మైన టాపిక్స్ వీక్షించ‌వ‌చ్చు.

థ్రెడ్స్‌లో పోస్టుల డ్రాఫ్ట్ సేవ్ చేసే ఆప్ష‌న్ లేదు. అందుకు భిన్నంగా ట్విట్ట‌ర్‌లో పోస్టు సేవ్ డ్రాఫ్ట్ ఆప్ష‌న్ ఉంది.

ట్విట్ట‌ర్‌, థ్రెడ్స్ యాప్స్‌లో థ్రెడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ కూడా విభిన్నం. థ్రెడ్స్ యూజ‌ర్‌.. అది తెర‌వడానికి మూడు సార్లు క్లిక్ చేయాలి. కానీ, ట్విట్ట‌ర్‌లో ప్ల‌స్ బ‌ట‌న్ నొక్కితే చాలు.. ఇత‌రుల ప్రొఫైల్ వీక్షించ‌డానికి థ్రెడ్స్‌లో ఇవ్వ‌లేదు. ట్విట్ట‌ర్‌లో అందుకు సెప‌రేట్ టాబ్ ఉంది.

వేధింపుల‌కు పాల్పడుతున్న యూజ‌ర్ల ఖాతాల‌పై నియంత్ర‌ణ‌కు, ఆయా ఖాతాల‌ను బ్లాక్ చేయ‌డానికి ఇన్‌స్టాగ్రామ్‌లో అమ‌ల‌వుతున్న నిబంధ‌న‌లే థ్రెడ్స్‌లో కొన‌సాగుతాయి. ఇన్‌స్టాగ్రామ్ సాయంతో థ్రెడ్స్ యూజ‌ర్లు విస్తృత సామాజిక వ‌ర్గాల‌తో సంప్ర‌దింపుల‌కు వీలు క‌లుగుతుంది. యాడ్స్‌లేకుండానే థ్రెడ్స్ లాంచ్ చేశారు. చాలా మంది థ్రెడ్స్ గురించి ఆస‌క్తి చూపుతున్నారు.

First Published:  7 July 2023 3:56 AM GMT
Next Story