Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో ఏఐ సపోర్ట్ ఫీచర్! ఎలా పనిచేస్తుందంటే..

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఏఐ ఫీచర్లను పరిచయం చేసేందుకు మెటా ప్రయత్నిస్తోంది.

వాట్సాప్‌లో ఏఐ సపోర్ట్ ఫీచర్! ఎలా పనిచేస్తుందంటే..
X

వాట్సాప్‌లో ఏఐ సపోర్ట్ ఫీచర్! ఎలా పనిచేస్తుందంటే..

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఎన్నో అద్భతాలు చేస్తోంది. అందుకే దీన్ని వీలైనంతవరకూ వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు. యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు మెటా సంస్థ కూడా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్‌లో ఏఐ ఫీచర్లను తీసుకురాబోతోంది. ఇదెలా ఉంటుందంటే..

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఏఐ ఫీచర్లను పరిచయం చేసేందుకు మెటా ప్రయత్నిస్తోంది. త్వరలోనే వాట్సాప్‌లో ఏఐ సపోర్ట్ ఫీచర్ రాబోతోంది. వాట్సాప్‌ బీటా ఇన్ఫో ప్రకారం వాట్సాప్‌లో యూజర్ ఇంటరాక్షన్ కోసం ఏఐ రెస్పాన్స్ టూల్‌ను డెవలప్ చేస్తున్నారు. వాట్సాప్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ఈ ఏఐ టూల్ తగిన సపోర్ట్ అందిస్తుంది. ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించే విధంగా ఈ టూల్‌ను డెవలప్ చేసినట్టు వాట్సాప్ చెప్తోంది. ఈ టూల్ మరింత పర్సనలైజ్డ్‌, ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ టూల్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. త్వరలో రాబోయే వాట్సాప్ బీటా వెర్షన్‌ 2.23.23.8లో ఈ ఫీచర్‌ కనిపించనుంది.

ఇకపోతే వాట్సాప్ తాజాగా బ్యాకప్ ఆప్షన్స్‌కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. గతంలో యూజర్లు తమ వాట్సప్‌లోని డేటాను అన్‌లిమిటెడ్‌గా బ్యాకప్‌ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు డేటా బ్యాకప్‌ను గూగుల్‌ అకౌంట్‌తో లింక్ చేసింది వాట్సాప్. అంటే ఇకపై వాట్సాప్ డేటా బ్యాకప్ అంతా గూగుల్ స్టోరేజ్‌ లిమిట్‌లోకి వస్తుంది. గూగుల్ డ్రైవ్ నిండితే వాట్సాప్ బ్యాకప్ సాధ్యం కాదు.

మరో ఫీచర్ విషయానికొస్తే.. అడ్మిన్ రియాక్షన్ ఫిల్టరింగ్ అనే మరో ఫీచర్‌‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో ఛానెల్ అడ్మిన్స్.. ఛానెల్‌లో షేర్ చేసిన కంటెంట్‌పై ఎంతమంది ఎలాంటి ఎమోజీలతో రియాక్ట్ అయ్యారో తెలుసుకోగలరు.

వీటితోపాటు వాట్సాప్ ఛానెల్స్‌లో యూజర్‌నేమ్స్, మెసేజ్‌లను ఈజీగా వెతుక్కోవడానికి ‘సెర్చ్ మెసేజెస్ బై డేట్’ ఆప్షన్, అలాగే ‘ఆల్టర్నేటివ్ ప్రొఫైల్’ పేరుతో ప్రైవసీ ఫీచర్, వాట్సాప్ వీడియోలను ఫార్వార్డ్, రివైండ్, స్కిప్ చేసుకునే ఆప్షన్స్ కూడా త్వరలో రానున్నాయి.

First Published:  19 Nov 2023 2:30 AM GMT
Next Story