Telugu Global
Science and Technology

హెచ్‌డీ ఫొటోలు, ఏఐ స్టికర్లు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

రీసెంట్‌గానే ‘మెసేజ్ ఎడిట్’ అనే ఫీచర్‌‌ను తీసుకొచ్చిన వాట్సాప్ .. తాజాగా మరికొన్ని లేటెస్ట్ ఫీచర్స్‌ను యాడ్ చేసింది.

హెచ్‌డీ ఫొటోలు, ఏఐ స్టికర్లు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
X

రీసెంట్‌గానే ‘మెసేజ్ ఎడిట్’ అనే ఫీచర్‌‌ను తీసుకొచ్చిన వాట్సాప్ .. తాజాగా మరికొన్ని లేటెస్ట్ ఫీచర్స్‌ను యాడ్ చేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే..

వాట్సప్‌లో హై రెజల్యూషన్‌ ఫొటోలూ షేర్‌ చేసుకునేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు వాట్సాప్‌లో ఫొటోలు పంపితే డిఫాల్ట్‌గా స్టాండర్డ్‌ క్వాలిటీలోకి మారి సెండ్ అయ్యేవి. ఇప్పుడు క్వాలిటీని యూజర్లే ఎంపిక చేసుకోవచ్చు. మొన్నటివరకూ బీటా టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఎనేబుల్ అవ్వాలంటే ముందుగా వాట్సప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌లోకి వెళ్లి చూస్తే.. ఫొటో షేరింగ్‌ స్క్రీన్‌లో ఇతర ఎడిటింగ్‌ టూల్స్‌ పక్కనే సరికొత్త ‘హెచ్‌డీ’ బటన్‌ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఒక పాపప్‌ విండో ఓపెన్‌ అవుతుంది. అందులో ఫొటో క్వాలిటీని సెలక్ట్ చేసుకోవచ్చు.

క్యాప్షన్‌తో కూడిన మీడియా మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవడం కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌‌ను యాడ్ చేసింది. ఫొటో, వీడియో, గిఫ్‌, డాక్యుమెంట్లకు క్యా్ప్షన్ జత చేసి పంపినప్పుడు దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే మెసేజ్‌ మీద నొక్కి పట్టుకోవాలి. అప్పుడు ‘ఎడిట్‌’ అనే ఫీచర్‌ కనిపిస్తుంది. అయితే మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు మాత్రమే ఎడిట్ చేయడం కుదురుతుంది.

ఇకపోతే ఏఐ సాయంతో స్టిక్కర్లు తయారుచేసుకునేలా వాట్సాప్ మరో ఫీచర్‌‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ఉపయోగించి అప్పటికప్పుడు వాట్సాప్‌‌లో అవసరమైన సొంత స్టిక్కర్స్‌ను రెడీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ స్టిక్కర్ ప్యాలెట్‌‌లోకి వెళ్తే కనిపిస్తుందని వాట్సాప్ చెప్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరి యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

First Published:  24 Aug 2023 8:17 AM GMT
Next Story