Telugu Global
Science and Technology

గూగుల్ మాకు పోటీ కాదంటున్న వాట్సాప్!

తాజాగా గూగుల్ సంస్థ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు పోటీగా సొంత మెసేంజర్ యాప్ ప్రవేశపెట్టింది. దానిపేరే ‘రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (ఆర్‌‌సీఎస్)’. వాట్సాప్ యూజర్లను అట్రాక్ట్ చేసేవిధంగా సరికొత్త ఫీచర్లతో గూగుల్ ఈ యాప్‌ను రూపొందించింది.

గూగుల్ మాకు పోటీ కాదంటున్న వాట్సాప్!
X

తాజాగా గూగుల్ సంస్థ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు పోటీగా సొంత మెసేంజర్ యాప్ ప్రవేశపెట్టింది. దానిపేరే ‘రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (ఆర్‌‌సీఎస్)’. వాట్సాప్ యూజర్లను అట్రాక్ట్ చేసేవిధంగా సరికొత్త ఫీచర్లతో గూగుల్ ఈ యాప్‌ను రూపొందించింది. ఈ క్రమంలో మెటా, గూగుల్ సంస్థల మధ్య పోటీ వాతావరణం నడుస్తోంది. రీసెంట్‌గా దీని గురించి మాట్లాడుతూ మెటా ఎగ్జిక్యూటివ్ ఏమన్నారంటే.

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో మెసేజింగ్ కేటగిరీలో వాట్సాప్ మోనోపొలీగా ఉంది. దాన్ని సవాలు చేస్తూ గూగుల్ ఓ కొత్త మెసేజింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మెటా ఎగ్జిక్యూటివ్ టార్సిసియో రిబీరో దీని గురించి మాట్లాడుతూ ఇండియాలోని మెసేజింగ్ సర్వీసెస్ మార్కెట్‌లో గూగుల్ మాకు ఏ మాత్రం పోటీ కాదు అని వివరించారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న ‘వరల్డ్ మొబైల్ కాంగ్రెస్’ వేదికగా ఆయన ఈ మాటలు అన్నారు.

‘ఇండియాలోని మెసేజింగ్ మార్కెట్‌లో మెటాకు ఎక్కువ వాటా ఉంది. అయితే ‘ఆర్‌‌సీఎస్’ ను మేము మా మార్కెట్ వాటాకు ముప్పుగా చూడము. మేము ఈ పోటీని స్వాగతిస్తున్నాము. మా యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడంపైనే మా దృష్టి ఉంటుంద’ని ఆయన అన్నారు. పొటీ మంచిదే అని, అది యూజర్లకు మరింత విలువను జోడిస్తుందని పేర్కొ్న్నారు.

ప్రస్తుతం ఇండియాలో మెసేజింగ్ సర్వీసెస్‌కు డిమాండ్ పెరుగుతోంది. బిజినెస్ కార్యకలాపాలన్నీ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారానే జరుగుతున్నాయి. 2030 నాటికి ఇండియాలో వాట్సాప్‌తో పాటు ఇతర మెసేజింగ్ యాప్‌లు చేసే బిజినెస్ 150 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఈ క్రమంలో గూగుల్ మెసేజింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం మార్కెట్‌కు మంచిదని, అది యూజర్లకు మరింత వాల్యూని క్రియేట్ చేస్తుందని రిబీరో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులు కూడా వాట్సాప్ వాడుతున్నారని, దేశంలో 45 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాలు వాట్సాప్‌ను ప్రమోషన్స్, యుటిలిటీ కోసం వాడుతున్నాయని ఆయన చెప్పారు.

ఇకపోతే ఆర్‌‌సీఎస్ అనేది వాట్సాప్ మాదిరిగా అన్ని కమ్యూనికేషన్ టూల్స్‌తో డిజైన్ చేసిన మెసేజింగ్ సర్వీస్. ఇందులో హైరెజుల్యుషన్ ఫొటోలు, వీడియోలను కూడా పంపుకోవచ్చు. గ్రూప్ చాట్స్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ లాగానే ఇది కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని గూగుల్ గతంలో ప్రకటించింది. బిజినెస్ యూజర్లకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

First Published:  29 Feb 2024 11:00 AM GMT
Next Story