Telugu Global
Science and Technology

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ యూనివర్సల్ స్పీచ్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్‌ జీపీటీ చాట్ బాట్ వచ్చిన తర్వాత టెక్ కంపెనీల మధ్య పోటీ పెరిగింది

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ యూనివర్సల్ స్పీచ్..
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్‌ జీపీటీ చాట్ బాట్ వచ్చిన తర్వాత టెక్ కంపెనీల మధ్య పోటీ పెరిగింది. చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ ఇప్పటికే తన ఏఐ బేస్డ్ బార్డ్ సెర్చ్ ఇంజిన్‌ను డెవలప్ చేస్తుండగా.. దాంతోపాటు ఏఐ బేస్డ్ యూనివర్సల్‌ స్పీచ్‌ మోడల్‌ను కూడా తీసుకురానుంది.

వచ్చే రెండేళ్లలో గూగుల్‌ 20 రకాల ఏఐ ప్రొడక్ట్‌లను తీసుకురానున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగానే యూనివర్సల్ స్పీచ్ మోడల్‌ను కూడా తీసుకురానుంది. ఈ టూల్ ద్వారా ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే వెయ్యి భాషలను ఏఐ పద్దతిలో యూజర్లు వినియోగించుకోవచ్చు.

ఈ స్పీచ్ మోడల్‌ను డెవలప్ చేయడం కోసం 300 భాషల్లో రెండు బిలియన్‌ పారమీటర్స్‌లో ఏఐకు శిక్షణ ఇచ్చి కొన్ని మిలియన్ గంటల ప్రసంగాలను, కొన్ని బిలియన్ల సెంటెన్స్‌లను తయారుచేసినట్లు గూగుల్‌ పేర్కొంది. ఇలాంటి స్పీచ్ మోడల్ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. యూట్యూబ్ వీడియోల్లో వచ్చే క్లోజ్డ్ క్యాప్షన్ ఈ కోవకే చెందుతాయి. అంటే డైలాగ్స్‌ను టెక్స్ట్ రూపంలో స్క్రీన్ మీద చూపించే టెక్నాలజీ. అయితే యూట్యూబ్ లో కేవలం ఒకట్రెండు భాషల్లోనే ఈ టూల్ అందుబాటులో ఉంది. కానీ, గూగుల్ ప్రపంచంలోని అన్ని భాషలకు సపోర్ట్‌ చేసేలా కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఈ టూల్‌ని ఏఆర్ టెక్నాలజీలో కూడా తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది.

First Published:  9 March 2023 5:49 AM GMT
Next Story