Telugu Global
Science and Technology

త్వరలోనే గూగుల్ పిక్సెల్ 8ఎ లాంఛ్! ఫీచర్లివే..

మే నెలలో జరగనున్న గూగుల్ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 లో గూగుల్ తన లేటెస్ట్ ‘పిక్సె్ల్ 8ఎ’ మొబైల్‌ను లాంఛ్ చేయనుంది.

త్వరలోనే గూగుల్ పిక్సెల్ 8ఎ లాంఛ్! ఫీచర్లివే..
X

టెక్ దిగ్గజం గూగుల్ నుంచి త్వరలో ‘పిక్సె్ల్ 8ఎ’ మొబైల్ లాంఛ్ అవ్వనుంది. గూగుల్ 7ఎ కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రిలీజవుతున్న ఈ బ్రాండ్ న్యూ మొబైల్‌ నుంచి ఎలాంటి ఫీచర్లు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే..

మే నెలలో జరగనున్న గూగుల్ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 లో గూగుల్ తన లేటెస్ట్ ‘పిక్సె్ల్ 8ఎ’ మొబైల్‌ను లాంఛ్ చేయనుంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్ డిజన్, ఫీచర్స్ లీక్ అయ్యాయి.

గూగుల్ పిక్సెల్ 8ఎ.. గూగుల్ టెన్సర్ జీ3 నైన్ కోర్ ప్రాసెసర్‌‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ బేస్డ్ పిక్సెల్ యూఐపై రన్ అవుతుంది. ఇందులో 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చని అంచనా.

‘గూగుల్ పిక్సె్ల్ 8ఎ’ లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.1-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1,400 నిట్స్ పీక్ హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్‌లో 4575ఎంఎహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండొచ్చు. ఇది 27వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8ఎ డిజైన్ అండ్ లుక్ ఇప్పటికే రివీల్ అయింది. మొబైల్ బ్యాక్ ప్యానెల్ పిక్సెల్ 8 మాదిరిగానే ఉంటుంది. అయితే సైడ్ ఫినిషింగ్, బ్యాక్ ఫినిషింగ్ మరింత ప్రీమియంగా కనపించనుంది. ఈ మొబైల్‌లో బే బ్లూ, మింట్ గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్, క్రిస్టల్ వైట్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇకపోతే ఈ మొబైల్‌లో 5జీ ఎనేబుల్డ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ వంటి ఫీచర్లున్నాయి. మెమరీ కార్డ్ స్లాట్ ఉండకపోవచ్చు. అలాగే ఇందులో గూగుల్ రీసెంట్‌గా డెవలప్ చేసిన జెమినీ యూఐకి సంబంధించిన టూల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

First Published:  16 April 2024 1:37 AM GMT
Next Story