Telugu Global
Science and Technology

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ‘లామ్డా’

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ‘లామ్డా’ పేరుతో కొత్త టూల్‌ను తీసుకురానుందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ‘లామ్డా’
X

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో సొంతంగా ఆలోచించి ఎలాంటి కంటెంట్‌ను అయినా క్రియేట్ చేయగలిగే చాట్ జీపీటి.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఇప్పటికే కోట్ల మంది యూజర్లు దీన్ని వాడుతున్నారు. ‘ఫ్యూచర్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్’గా దీన్ని వర్ణిస్తున్నారు.

అయితే దీన్ని చూసి గూగుల్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఆలోచనలో పడ్డాయి. చాట్ జీపీటీకి పోటీగా త్వరలోనే గూగుల్ కూడా ఒక ఏఐ బేస్డ్ టూల్‌ను తీసుకురానుంది.

మొన్నటివరకూ బ్రౌజింగ్ కోసం అందరూ గూగుల్‌ని ఆశ్రయించేవాళ్లు. అయితే ఇప్పుడు చాలామంది ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే గూగుల్‌కు బదులుగా చాట్‌జీపీటీని అడుగుతున్నారు. దాంతో చాట్‌జీపీటీ తరహా ఏఐ సేవలు తీసుకురావడంపై గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కొన్ని కామెంట్స్ చేశారు.

త్వరలోనే గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌లో ఏఐ బేస్డ్ రిజల్ట్స్ ను తీరుకురానున్నట్లు తెలిపారు. ‘‘ప్రస్తుతం మనం వాడుతున్న వాటిలో ఏఐ ఎంతో కీలకమైన టెక్నాలజీ. త్వరలోనే గూగుల్ బ్రౌజర్‌లో కూడా ఏఐ బేస్డ్ సేవలను యూజర్లకు పరిచయం చేయనున్నాం.

అలాగే ఏపీఐ డెవలపర్స్‌ కోసం కొత్త టూల్స్‌ను కూడా తీసుకొస్తున్నాం. వాటితో డెవలపర్స్ సొంతగా అప్లికేషన్స్‌ను రూపొందించవచ్చు’’ అని సుందర్‌ పిచాయ్‌ అన్నారు.

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ‘లామ్డా’ పేరుతో కొత్త టూల్‌ను తీసుకురానుందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. “రాబోయే కొన్ని నెలల్లో, మేము లామ్డా(LaMDA) పేరుతో లాంగ్వేజ్‌ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం”అని చెప్పారు.

ఇది ప్రజల నుంచి ఫ్యీడ్‌బ్యాక్‌ తీసుకుని, కంటెంట్‌ను మరింత కంపోజ్డ్‌గా , కన్‌ స్ట్రక్టివ్‌గా తయారు చేస్తుందని అంటున్నారు. మరి అది ఎప్పటికి అంబాటులోకి వస్తుంది? చాట్ జీపీటీకి పోటీనిస్తుందా? అనేది వేచి చూడాలి.

First Published:  7 Feb 2023 11:01 AM GMT
Next Story