Telugu Global
Science and Technology

గూగుల్ టూల్స్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు!

ఆఫీస్ వర్క్ చేసుకునే చాలామంది గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ వంటి గూగుల్ సూట్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడుతుంటారు. అయితే గూగుల్ ఇప్పుడు ఆ టూల్స్‌లో ఏఐ ఫీచర్లను ఎనేబుల్ చేస్తూ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది.

గూగుల్ టూల్స్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు!
X

ఆఫీస్ వర్క్ చేసుకునే చాలామంది గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ వంటి గూగుల్ సూట్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడుతుంటారు. అయితే గూగుల్ ఇప్పుడు ఆ టూల్స్‌లో ఏఐ ఫీచర్లను ఎనేబుల్ చేస్తూ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది.

రీసెంట్‌గా లాస్​ వెగాస్​లో జరిగిన గూగుల్ క్లౌడ్ నెక్ట్స్-2024 కాన్ఫరెన్స్​లో భాగంగా గూగుల్ తమ వర్క్ స్పేస్ సూట్‌ను అప్‌డేట్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా కొన్ని గూగుల్ సాఫ్ట్‌వేర్స్‌లో ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అవేంటంటే..

డేటా యాక్సెస్ టు డాక్స్

గూగుల్ డాక్స్‌ను చాలామంది చాలా అవసరాల కోసం వాడుతుంటారు. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌‌లో యూజర్లు డేటాను ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా కొత్త ఏఐ ఫీచర్లను జత చేసింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు మిగతా డాక్యుమెంట్లలోని తమ డేటా మొత్తాన్ని ఒకే డాక్యుమెంట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.

డ్రైవ్ స్పేస్ నిండకుండా..

గూగుల్ డ్రైవ్‌ను చాలామంది వాడుతుంటారు. యూజర్లు తమ పర్సనల్ ఫైల్స్, ఫొటోలు, వీడియోల వంటివి డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసుకుని దాచుకుంటుంటారు. అయితే డ్రైవ్‌లో స్పేస్ త్వరగా అయిపోవడం అనేది చాలామంది ఫేస్ చేసే సమస్య. దీనికి సొల్యూషన్‌గా డ్రైవ్‌లో ఫైల్స్‌ను నచ్చిన సైజుల్లో కంప్రెస్ చేసుకుని సేవ్ చేసుకునే ఫీచర్‌ రాబోతోంది.

మీటింగ్‌లో నోట్స్

వీడియో కాన్ఫరెన్స్, మీటింగ్స్ కోసం చాలామంది గూగుల్​ మీట్‌ను వాడుతుంటారు. అయితే ఈ మీటింగ్స్‌లో ఎప్పుడైనా నోట్స్ రాసుకోవాల్సి వస్తే.. ఇబ్బంది పడకుండా ‘టేక్ నోట్స్’ అనే ఏఐ ఫీచర్​ను తీసుకురాబోతోంది గూగుల్. ఈ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా రికార్డ్ అవుతున్న వాయిస్ నుంచి ఆటోమెటిక్‌గా నోట్స్ సేవ్ అయిపోతుంది.

గూగుల్ షీట్స్ టెంప్లేట్స్

డేటాను పట్టిక రూపంలో పొందుపరచేందుకు గూగుల్ షీట్స్ పనికొస్తాయి. అయితే ఇందులో సులభంగా డేటాను ఎంట్రీ చేసుకునే విధంగా గూగుల్ కొన్ని ఫార్మాట్స్‌ను తీసుకురానుంది. ఏఐ సాయంతో తయారయ్యే ఈ టెంప్లేట్స్‌తో డేటాను సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.

జీమెయిల్‌లో రైటింగ్ టూల్

సింపుల్‌గా జీమెయిల్స్ రాసేందుకు వీలుగా గూగుల్ ‘హెల్ప్​ మీ టు రైట్’ అనే ఏఐ ఫీచర్‌‌ను తీసుకురాబోతోంది. ఈ టూల్ సాయంతో వాయిస్ ద్వారా లేదా కొన్ని వర్డ్స్ సాయంతో స్పెల్లింగ్, గ్రామర్​​ మిస్టెక్స్ లేకుండా పూర్తి మెయిల్‌ను కంపోజ్ చేయొచ్చు.

చాట్‌లో లాంగ్వేజెస్

గూగుల్​ చాట్‌కు జెమిని ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది గూగుల్. ఈ అప్‌డేట్ సాయంతో సుమారు 69 భాషల్లోకి ఆటోమేటిక్​గా మెసేజ్​లను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.

First Published:  14 April 2024 4:31 AM GMT
Next Story