Telugu Global
Science and Technology

గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్! హైలెట్స్ ఇవే..

Google for India 2022: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సోమవారం ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌.. గూగుల్‌కి సంబంధించి కొన్ని కొత్త ప్రకటనలు చేశాడు.

గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్! హైలెట్స్ ఇవే..
X

గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్! హైలెట్స్ ఇవే..

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సోమవారం 'గూగుల్ ఫర్ ఇండియా 2022' ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌.. గూగుల్‌కి సంబంధించి కొన్ని కొత్త ప్రకటనలు చేశాడు. మెరుగైన భారత్ కోసం గూగుల్ సర్వీసుల్లో కొన్ని కొత్త అప్‌డేట్స్ తీసుకొచ్చామన్నాడు.

గూగుల్ ఈవెంట్‌లో భాగంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ గూగుల్ సర్వీసుల్లో ఒకటైన 'గూగుల్ పే' యాప్ ఇండియాలో సక్సెస్ అయిందన్నారు. ఈ యూపీఐ సర్వీసులను ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించనున్నట్టు ప్రకటించారు. అలాగే కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. దేశంలో గణనీయమైన మార్పులను తీసుకురాబోతుంది అన్నారు. ఈవెంట్ సందర్భంగా ప్రకటించిన కొన్ని అప్‌డేట్స్‌లో బెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం.

డిజిలాకర్ ఇంటిగ్రేషన్

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లు గూగుల్ 'ఫైల్స్' యాప్ ద్వారా డిజిలాకర్‌‌ని కూడా యాక్సెస్ చేసుకునేలా కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. ఈ వర్చువల్ లాకర్‌‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లన్నింటినీ పేపర్‌లెస్ ఫార్మాట్‌లో డిజిటల్‌గా దాచుకోవచ్చు.

గూగుల్ పే ట్రాన్సాక్షన్ సెర్చ్

గూగుల్ పే యాప్‌లో తీసుకొచ్చిన 'ట్రాన్సాక్షన్ సెర్చ్' అనే ఫీచర్ ద్వారా యూజర్లు తమ లావాదేవీల గురించి వాయిస్ ద్వారా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అనుమానాస్పద లావాదేవీల కోసం గూగుల్.. ఎమ్‌ఎల్ అల్గారిథమ్‌లను ఉపయోగించి మరిన్ని వార్నింగ్ మెసేజ్ లు ఇవ్వనుంది.

వీడియోలో సెర్చ్

'గూగుల్ సెర్చ్ ఫెసిలిటీ ఇన్‌సైడ్ వీడియో' అనే మరో కొత్త ఫీచర్ ద్వారా వీడియోలో ఏదైనా విషయాన్ని సెర్చ్ చేయొచ్చని గూగుల్ చెప్తోంది. అంటే.. ఒక వీడియో చూసేటప్పుడు ఆ వీడియోలోని కంటెంట్కకు సంబంధించి ఏదైనా డౌట్ వస్తే ఈ ఫీఛర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ సెర్చ్ చేసిన విషయం ఆ వీడియోలో ఉంటే డైరెక్ట్‌గా వీడియో అక్కడి నుంచి ప్లే అవుతుంది.

యూట్యూబ్‌లో కొత్త కోర్సులు

గూగుల్ తమ యూట్యూబ్ యాప్‌లో 'కోర్సులు' అనే కేటగిరీని తీసుకొచ్చింది. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ ద్వారా అనేక విషయాలను నేర్చుకోవడానికి ఈ కోర్సులు వీలు కల్పిస్తాయి. ఇందులో ఫ్రీ కోర్సులు, పెయిడ్ కోర్సులు కూడా ఉంటాయి.

అన్ని భాషల్లో సెర్చ్ రిజల్ట్స్

అన్ని భారతీయ భాషల్లో సెర్చ్ రిజల్ట్స్‌ వచ్చేలా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను అప్ డేట్ చేసినట్టు ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ ఫీచర్ ద్వారా ఇంగ్లిష్, హిందీతో పాటు తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఈజీగా గూగుల్ సెర్చ్ చేసే వీలుంటుంది.

మెడికల్ ప్రిస్క్రిప్షన్

కొత్త ఏఐ ఫీచర్ ద్వారా డాక్టర్లు రాసిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను డీకోడ్ చేసేలా 'గూగుల్ లెన్స్' యాప్‌ను అప్‌డేట్ చేసింది గూగుల్. దీంతో డాక్టర్లు రాసిన మందులను ఎవరైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనికోసం అపోలో హాస్పిటల్స్‌.. గూగుల్‌తో కలిసి పనిచేస్తుంది. డాక్టర్లు రాసిన మందుల చిట్టీ అర్థం కాకపోతే గూగుల్ లెన్స్ దాన్ని డీకోడ్ చేసి చూపిస్తుంది. దీంతో మందులు కొనుక్కోవడం మరింత తేలికవుతుంది.

First Published:  20 Dec 2022 12:12 PM GMT
Next Story