Telugu Global
Science and Technology

జీమెయిల్‌ను ఇలా క్లీన్ చేయొచ్చు!

జీమెయిల్‌లో ముఖ్యమైన మెయిల్స్ కంటే అవసరం లేని జంక్ మెయిల్స్, స్పామ్, ప్రమోషనల్ మెయిల్సే ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోవడంతోపాటు స్టోరేజీ కూడా వేస్ట్ అవుతుంటుంది.

జీమెయిల్‌ను ఇలా క్లీన్ చేయొచ్చు!
X

జీమెయిల్‌లో ముఖ్యమైన మెయిల్స్ కంటే అవసరం లేని జంక్ మెయిల్స్, స్పామ్, ప్రమోషనల్ మెయిల్సే ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోవడంతోపాటు స్టోరేజీ కూడా వేస్ట్ అవుతుంటుంది. మరి జీమెయిల్‌ను క్లీన్ చేయడం ఎలా?

వందల కొద్దీ వచ్చే ప్రమోషనల్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్‌తో ఇన్‌బాక్స్ అంతా నిండిపోతుంటుంది. వీటిని ఏరోజుకారోజు డిలీట్ చేయడం కుదరని పని. అందుకే వీలున్నప్పుడల్లా ఒకేసారి అన్ని మెయిల్స్‌ను ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

జీమెయిల్‌లో ఒకేసారి కేవలం 50 మెయిల్స్‌ను మాత్రమే డిలీట్ చేసే వీలుంటుంది. అలా కాకుండా అన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయాలంటే.. జీమెయిల్ డెస్క్‌టాప్ వెర్షన్‌లోకి వెళ్లి మెయిల్ సెర్చ్​ బార్ ​లో ‘is:unread’ అని టైప్ చేయాలి. తర్వాత ‘సెలక్ట్ ఆల్’ మీద నొక్కితే 50 మెయిల్స్ సెలక్ట్ అవుతాయి. ఇప్పుడు పక్కనే కనిపిస్తున్న ‘సెలక్ట్ ఆల్ కన్వర్జేషన్స్ దట్ మ్యాచ్ దిస్ సెర్చ్(select all conversations that match this search)’ పైనొక్కితే.. చదవకుండా మిగిలిపోయిన మెయిల్స్ అన్నీ ఒకేసారి సెలక్ట్ అవుతాయి. తర్వాత డిలీట్ ఆప్షన్ నొక్కితే ‘కన్ఫర్మ్’ అని అడుగుతుంది. ‘ఓకే’ పై క్లిక్ చేస్తే అన్‌రీడ్ మెయిల్స్‌ అన్నీ డిలీట్ అవుతాయి. అయితే దీనికి రెండు మూడు నిముషాల టైం పడుతుంది.

ఇక దీంతోపాటు జీమెయిల్‌లో ఉన్న సెర్చ్ ఫిల్టర్స్‌ ఆధారంగా కూడా బల్క్‌లో మెయిల్స్ డిలీట్ చేయొచ్చు. సెర్చ్​ బార్​లో ఫైల్ సైజు అంటే 10ఎంబీ, 20 ఎంబీ.. ఇలా సైజు ఎంటర్ చేసి పెద్ద పెద్ద ఫైల్స్‌ను డిలీట్ చేయొచ్చు. అలాగే డేట్ ఫిల్టర్‌‌లో మీకు అవసరం లేవనుకున్న మెయిల్స్‌ను తేదీలు, సంవత్సరాల ఆధారంగా డిలీట్ చేసేయొచ్చు. ఉదాహరణకు 2001 నుంచి 2023 వరకూ సెలక్ట్ చేసుకుని పాత మెయిల్స్ అన్నీ క్లియర్ చేయొచ్చు. అలాగే జీమెయిల్ సెర్చ్ బార్​లో ‘older_than:4y’ అని టైప్ చేసి నాలుగేళ్ల క్రితం లేదా మూడేళ్ల క్రితం.. ఇలా నచ్చినట్టుగా మెయిల్స్‌ను డిలీట్ చేయొచ్చు. వీటితోపాటు స్పామ్, ట్రాష్ ఫోల్డర్స్‌ను కూడా అప్పుడప్పుడు క్లియర్ చేస్తుంటే జీమెయిల్ క్లియర్‌‌గా ఉంటుంది.

First Published:  23 March 2024 5:15 AM GMT
Next Story