Telugu Global
Science and Technology

గ‌గ‌న్‌యాన్ క్రూ ఎస్కేప్ ప‌రీక్ష‌...ఎప్పుడంటే

తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.

గ‌గ‌న్‌యాన్ క్రూ ఎస్కేప్ ప‌రీక్ష‌...ఎప్పుడంటే
X

తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమ‌గాములను అత్యవసర సందర్భాల్లో సురక్షితంగా భూమికి చేర్చేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ వ్యవస్థను అతి త్వరలో పరీక్షించనుంది.


గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు సంబందించి టెస్ట్ వెహిక‌ల్ అబోర్ట్ మిష‌న్-1(టీవీ-డీ1) రూపుదిద్దుకుంది. గగన్ యాన్ యాత్ర మధ‌్యలో వ్యోమగాములు అత్యవసర పరిస్థితులలో సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా పొందుపర్చనున్న ఈ అబార్ట్ మిషన్ వన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది.



ఈ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను మూడు రోజుల పాటు భూమి నుంచి 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్తారు. సాధారణంగా ఉపగ్రహాలను నింగిలోకి పంపే ప్రక్రియతో పోల్చితే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది. పీడ‌నం లేన‌టువంటి క్రూ మాడ్యూల్ లోనే వ్యోమ‌గాములు నింగిలోకి వెళ్తారు. అయితే ప్ర‌స్తుతం టెస్టింగ్ కోసం ఆ మాడ్యూల్‌ను ఖాళీగా నింగిలోకి పంపి, మ‌ళ్లీ భూమిపై దించ‌నున్నారు.


ఈ క్రమంలో రాకెట్ నుంచి విడివడే క్రూ మాడ్యుల్ పారాషూట్ల సాయంతో బంగాళాఖాతంలో దిగుతుంది. స‌ముద్రం నుంచి ఇండియ‌న్ నేవీ ఆ మాడ్యూల్ మెష‌న్‌ను తీసుకురానున్న‌ట్లు ఇస్రో తెలిపింది. ఈ సందర్భంగా వ్యోమగాముల రక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును మాడ్యూల్‌లోని వివిధ పరికరాలతో శాస్త్రవేత్తలు సేకరిస్తారు. క్రూ మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకున్నాక అందులోని డాటా ఆధారంగా మరిన్ని మెరుగులు దిద్దుతారు. ఈ మాడ్యూల్‌ను ప్రస్తుతం లాంచింగ్ కాంప్లెక్స్‌కు చేర్చారు. టెస్ట్ ఫ్ల‌యిట్ స‌క్సెస్ అయిన త‌ర్వాత గ‌గ‌న్‌యాన్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు.



గగన్ యాన్ ప్రయోగాన్ని ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేప‌ట్ట‌గా.. వాటి స‌ర‌స‌న నిలిచేందుకు భార‌త్ తొలిసారి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతోంది.


First Published:  7 Oct 2023 8:17 AM GMT
Next Story