Telugu Global
Science and Technology

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఇవే..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైంది. ఇందులో రకరకాల ప్రొడక్ట్స్‌పై రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో తక్కువ ధరకు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఇవే..
X

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఇవే..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైంది. ఇందులో రకరకాల ప్రొడక్ట్స్‌పై రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో తక్కువ ధరకు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ

రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ’ ఫోన్.. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే లభిస్తుంది. దీని అసలు ధర రూ.18,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ను రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.46 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇది శాంసంగ్ ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది.

మోటొరోలా జీ54 5జీ

రీసెంట్‌గా లాంఛ్ అయిన ‘మోటొరోలా జీ54 5జీ’ ఫోన్ ధర రూ.18,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా దీన్ని రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్ సెట్‌తో వస్తుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది.

రెడ్ మీ నోట్ 12 5జీ

‘రెడ్ మీ నోట్ 12 5జీ’ ఫోన్ లాంఛింగ్ ధర రూ.17,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది రూ.14,999కే లభిస్తుంది. ఇందులో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌సెట్ ఉంటుంది. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

పొకో ఎక్స్5 5జీ

షావోమీ సబ్ బ్రాండ్ అయిన పొకో.. రీసెంట్‌గా ‘పొకో ఎక్స్5 5జీ’ ఫోన్ తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ.20,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా దీన్ని రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ

ఇన్ఫినిక్స్ కంపెనీ గత జూన్ నెలలో లాంఛ్ చేసిన ‘ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ’ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది రూ.13,999లకే లభిస్తుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ వంటివి ఇందులో హైలైట్స్.

రియల్‌మీ 11ఎక్స్ 5జీ

రియల్‌మీ సంస్థ గత ఆగస్టులో రిలీజ్ చేసిన ‘రియల్ మీ 11 ఎక్స్ 5జీ’ ఫోన్ ధర.. రూ.14,999 కాగా ఫ్లిప్ కార్ట్ సేల్‌లో ఇది రూ.2000 డిస్కౌంట్‌తో రూ.12,999కు లభిస్తుంది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.

First Published:  9 Oct 2023 11:15 AM GMT
Next Story