Telugu Global
Science and Technology

భూమి స్పిడు పెరిగింది!

భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది అని చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. అయితే ఇప్పుడా లెక్క కాస్త తప్పింది. ఎందుకంటే ఇప్పుడు భూమి స్పీడ్ పెరిగింది.

భూమి స్పిడు పెరిగింది!
X

భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది అని చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. అయితే ఇప్పుడా లెక్క కాస్త తప్పింది. ఎందుకంటే ఇప్పుడు భూమి స్పీడ్ పెరిగింది. 24 గంటలు పూర్తవ్వక ముందే భూమి ఒక రౌండ్ తిరుగుతోందట! దీంతో టైంని కొలిచే లెక్కలన్నీ మారిపోతాయంటున్నారు సైంటిస్టులు.

కొన్నేండ్లుగా భూమి వేగంగా తిరిగేస్తోంది. దీంతో రోజులు చిన్నవైపోతున్నాయి. ఇటీవలే భూమి చరిత్రలో అతి చిన్న రోజు నమోదైంది. 24 గంటలు పూర్తవ్వడానికి ఇంకా 1.59 మిల్లీ సెకండ్ల టైం మిగిలి ఉండగానే భూమి తన చుట్టు తాను తిరిగేసింది. మిల్లీ సెకండ్‌లో ఏముంది అనుకుంటున్నారేమో.. అక్కడే అంతా ఉందంటున్నారు సైంటిస్టులు. ప్రపంచమంతా టైంతో కనెక్ట్ అవ్వడానికి దేశాలు తమ గడియారాలను యూనివర్సల్‌ టైం ప్రకారం సరిచేసుకుంటాయి.

ఈ యూనివర్సల్ టైంను ఎటామిక్ గడియారాల ద్వారా కొలుస్తారు. ఇవి భూమి తిరిగే వేగాన్ని బట్టి పనిచేస్తుంటాయి. ఒక్క మిల్లీసెకండ్ తేడా వచ్చినా లెక్కలన్నీ మారిపోతాయి. జీపీఎస్‌, శాటిలైట్ వంటివి పనిచేయటానికి కచ్చితమైన టైం అవసరం.

కాబట్టి, భూమి వేగం ఇలాగే పెరుగుతూ పోతే ముందుముందు గడియారాల నుంచి ఒక సెకండును తొలగించాల్సి వస్తుందట. అలా చేస్తే సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ సిస్టమ్స్‌కు పెద్ద తలనొప్పే. ప్రస్తుతమున్న కంప్యూటర్‌ సర్వర్లు టైంని సెకండ్ల ప్రకారం లెక్కించుకుంటూ పనిచేస్తాయి. దీన్ని ‘ఎపోక్‌ టైమ్‌’ అంటారు. ఇప్పుడు గడియారంలో ఒక సెకండ్ తొలిగిస్తే సర్వర్ల పనితీరు దెబ్బతింటుంది. ఇంటర్నెట్‌ సేవలు కూడా ఆగిపోతాయి. వాటన్నింటినీ మళ్లీ సరిచేయాలి. అసలు భూమి స్పీడ్‌గా ఎందుకు తిరుగుతుందో కచ్చితమైన కారణాన్ని సైంటిస్టలు కనిపెట్టలేదు. వాతావరణ మార్పుల నుంచి చంద్రుడి గ్రావిటీ వరకూ చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు.

First Published:  23 March 2023 10:09 AM GMT
Next Story