Telugu Global
Science and Technology

ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు!

ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ పేలి ప్రాణాలు పోతున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ అలా పేలడానికి అందులో ఉండే బ్యాటరీనే ముఖ్యమైన కారణం.

ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు!
X

ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు!

ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ పేలి ప్రాణాలు పోతున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ అలా పేలడానికి అందులో ఉండే బ్యాటరీనే ముఖ్యమైన కారణం. ఛార్జింగ్ పెట్టేటప్పుడు, ఫోన్ వాడేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల బ్యాటరీ పనితీరులో మార్పులొచ్చి కొన్ని సందర్భాల్లో పేలిపోతుంటుంది. కాబట్టి ఫోన్ పాతదయ్యేకొద్దీ బ్యాటరీ విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.

స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేసే విషయంలో చాలామంది చేసే మిస్టేక్ ఏదో ఒక ఛార్డర్‌‌తో ఛార్జింగ్ పెట్టడం. కంపెనీ ఇచ్చిన ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్‌‌లు వాడడం వల్ల బ్యాటరీపై అదనపు భారం పడడం లేదా సరిపడా ఛార్జ్ అందకపోవడం జరుగుతుంది. ఇది ఒక్కోసారి పేలుడికి దారితీయొచ్చు. కాబట్టి ఛార్జింగ్ అడాప్టర్ విషయంలో పొరపాట్లు చేయొద్దు. అలాగే కేబుల్ కూడా మేలైనదే వాడాలి. నాసిరకం కేబుల్స్ వాడడం వల్ల విద్యుత్ సరఫరాలో మార్పులొచ్చే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్ ప్రొటెక్షన్ కోసం వాడే ఫోన్ కవర్లతో కొన్నిసార్లు ఇబ్బందులుంటాయి. మామూలుగా ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ కొంత వేడెక్కుతుంది. దానికితోడు మందపాటి ఫోన్ కవర్ వాడడం వల్ల ఆ వేడి బయటకు పోకుండా ఫోన్ మరింత వేడెక్కడానికి కారణమవుతుంది. దీనివల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదముంది. అందుకే ఫోన్ హీటింగ్ సమస్య ఉన్నవాళ్లు కనీసం ఛార్జ్ చేసేటప్పుడైనా బ్యాక్ కవర్లను తొలగించాలి.

ఇకపోతే చాలామంది రాత్రిళ్లు ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తుంటారు. సాధారణంగా కొన్ని మొబైల్స్ ఫుల్ ఛార్జ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ను డిజేబుల్ చేస్తాయి. కానీ, కొన్ని మొబైల్స్ మాత్రం బ్యాటరీ నిండిన తర్వాత కూడా ఛార్జింగ్‌ను తీసుకుంటూనే ఉంటాయి. దీనివల్ల బ్యాటరీ త్వరగా పాడవ్వడం, బ్యాటరీ ఉబ్బడం, హీట్ ఎక్కడ లాంటి సమస్యలొస్తాయి. ఇది ఒక్కోసారి పేలడానికి కారణమవ్వొచ్చు. కాబట్టి నైట్ ఛార్జింగ్ పెట్టి వదిలేసే అలవాటును మార్చుకోవాలి. పగటిపూట ఛార్జింగ్ పెట్టి ఫుల్ అవ్వగానే తీసేయాలి.

First Published:  23 Aug 2023 5:45 AM GMT
Next Story