Telugu Global
Science and Technology

ల్యాప్‌టాప్ వాడేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!

ల్యాప్‌టాప్ వాడేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ల్యాప్‌టాప్ హీటెక్కి పాడవ్వడం, మదర్ బోర్డ్ పని చేయకపోవడం వంటి సమస్యలతోపాటు రేడియేషన్ పెరిగి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

ల్యాప్‌టాప్ వాడేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!
X

హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో భాగంగా లేదా ఇతర పనుల కోసమని చాలామంది ల్యాప్‌టాప్‌లపై ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే ల్యాప్‌టాప్ వాడేవిషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

ల్యాప్‌టాప్ వాడేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ల్యాప్‌టాప్ హీటెక్కి పాడవ్వడం, మదర్ బోర్డ్ పని చేయకపోవడం వంటి సమస్యలతోపాటు రేడియేషన్ పెరిగి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అదెలాగంటే..

ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని పనిచేస్తుంటారు చాలామంది. అయితే ఈ అలవాటు వల్ల చాలా నష్టం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ల్యాప్‌టాప్ నుంచి రకరకాల ఫ్రీక్వెన్సీలలో మైక్రోవేవ్ సిగ్నల్స్ ఎమిట్ అవుతూ ఉంటాయి. ఇవి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కు అలాగే చర్మానికి నష్టం కలింగించగలవు. కాబట్టి ల్యాప్‌టాప్‌ను శరీరానికి దూరంగా ఉంచి ఆపరేట్ చేయాలి.

ల్యాప్‌టాప్‌ను ఒళ్లో ఉంచుకుని పనిచేస్తే.. మెడ, వీపు భాగాన్ని ముందుకి వంచాల్సిన కారణంగా మెడనొప్పి, వెన్ను నొప్పి రావొచ్చు. కాబట్టి ల్యాపీపై పనిచేసేటప్పుడు పోశ్చర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

ల్యాప్‌టాప్‌లో ఉండే ప్రాసెసర్ వేడెక్కకుండా ఉండేందుకు కింద కూలింగ్ ఫ్యాన్‌లు ఉంటాయి. ఆ వేడి గాలి బయటకు వెళ్లేందుకు ల్యాపీ అడుగుభాగంలో రంధ్రాలు ఉండడం కూడా మనం గమనించొచ్చు. అయితే ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉన్నప్పుడు ఆ హోల్స్ నుంచి గాలి బయటకు వెళ్లేలా కింద ఏదైనా ఎత్తు అమర్చాలి. లేదా కూలింగ్ ప్యా్డ్స్ వంటివి వాడాలి. దిండు లేదా పరుపుపై పెట్టి వాడడం వల్ల ల్యాప్‌టాప్ ఎక్కువగా హీట్ ఎక్కి ప్రాసెసర్ దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువ సేపు ల్యాపీపై పనిచేసేవాళ్లు కూలింగ్ ప్యాడ్ వాడడం మంచిది.

ల్యాప్‌టాప్ పనితీరు బాగుండాలంటే అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేయడం అవసరం. ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్‌ చేసి వాక్యుమ్ క్లీనింగ్ ట్యూబ్స్‌తో హోల్స్ వద్ద క్లీన్ చేయాలి. అలాగే కాటన్ బడ్స్ లేదా బ్రష్ తో యూఎస్ బీ, చార్జింగ్ పోర్ట్స్‌ను కూడా క్లీన్ చేస్తే ల్యాపీ పాడవ్వకుండా ఉంటుంది.

మొబైల్లో లాగానే ల్యాప్‌టాప్‌లో కూడా ఎప్పటికప్పుడు క్యాచీ ఫైల్స్‌ను, జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేస్తుండాలి. లేకపోతే క్రమంగా ల్యాపీ స్లో అయ్యే అవకాశం ఉంది. ఫైల్స్ క్లీన్ చేయడం కోసం విండోస్ సెర్చ్‌లో ‘డిస్క్ క్లీనప్’ అని టైప్ చేసి స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

First Published:  31 March 2024 10:43 AM GMT
Next Story