Telugu Global
Science and Technology

ఇక ఫోన్లో టీవీ చూడచ్చు సిమ్‌, ఇంటర్నెట్‌ లేకుండానే

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతి ఆభరణం అయిన ఫోన్ లోనే అన్ని ఇమిడిపోతున్నాయి. అయితే ఏది చూడాలన్నా ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. అందుకోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడము, ఇంటర్నెట్ ప్యాక్ వేసుకోవడము తప్పనిసరి.

ఇక ఫోన్లో టీవీ చూడచ్చు సిమ్‌, ఇంటర్నెట్‌ లేకుండానే
X

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతి ఆభరణం అయిన ఫోన్ లోనే అన్ని ఇమిడిపోతున్నాయి. అయితే ఏది చూడాలన్నా ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. అందుకోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడము, ఇంటర్నెట్ ప్యాక్ వేసుకోవడము తప్పనిసరి. కానీ అవేవీ లేకుండా ఇకపై మొబైల్లో ఫ్రీగా టీవీ చూసేయొచ్చు.

కేంద్రం ఈ తరహా టెక్నాలజీని తయారు చూస్తోంది. ఇందుకోసం డీ2హెచ్ తరహలో డీ2ఎంను సాంకేతికతను రూపొందిస్తోంది. ఇదే గనుక అందుబాటులోకి వస్తే ఫోన్‌లో సిమ్ కార్డు, దాంట్లో ఇంటర్నెట్ లేకుండా ఫ్రీగా టీవీ చూసేయొచ్చు. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర కీలక విషయాలు వెల్లడించారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ డీ2ఎం సాంకేతికత ట్రయల్స్‌ను త్వరలో 19 నగరాల్లో చేపడతామని తెలిపారు. ఇందు కోసం 470-582 MHz స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో యూజర్లు వినియోగిస్తున్న కంటెంట్‌లో 69 శాతం వీడియో ఫార్మాట్‌లోనిదేనని పేర్కొన్నారు. ఇందులో 25-30 శాతం వీడియో కంటెంట్‌ ట్రాఫిక్‌ను డీ2ఎంకు మార్చడం ద్వారా 5జీ నెట్‌వర్క్‌లపై భారం తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు.

గత సంవత్సరం, డీ2ఎం సాంకేతికతను పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ డీ2ఎం బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీని ఐఐటీ కాన్పూర్‌, సాంఖ్య ల్యాబ్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ప్రసార రంగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

ఈ ప్రసార సాంకేతికత టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్-అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్, స్మార్ట్ పరికరాలకు ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అయితే మొబైల్ పరికరాలకు D2Mకి మద్దతు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన హార్డ్‌వేర్ అవసరం ఉంది. అదనపు చిప్‌ లేదా డాంగిల్స్ ఏర్పాటు చేయటంవల్ల స్మార్ట్‌ఫోన్‌ల ధర పెరగవచ్చు.

First Published:  17 Jan 2024 11:11 AM GMT
Next Story