Telugu Global
Science and Technology

డిజిటల్ లోన్స్‌తో జాగ్రత్త!

యాప్ ద్వారా లోన్స్ లేదా అప్పులు ఇచ్చే చిన్న చిన్న ఫిన్‌ టెక్ సంస్థలు ఇప్పుడు బాగా పెరిగాయి. అయితే మొబైల్ నెంబర్ లేదా ఆధార్, పాన్ కార్డు నెంబర్లతో సులభంగా లభించే ఈ లోన్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

డిజిటల్ లోన్స్‌తో జాగ్రత్త!
X

యాప్ ద్వారా లోన్స్ లేదా అప్పులు ఇచ్చే చిన్న చిన్న ఫిన్‌ టెక్ సంస్థలు ఇప్పుడు బాగా పెరిగాయి. అయితే మొబైల్ నెంబర్ లేదా ఆధార్, పాన్ కార్డు నెంబర్లతో సులభంగా లభించే ఈ లోన్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ లోన్ తీసుకోవాల్సి వస్తే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

యాప్ ద్వారా లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సంస్థ ఆర్‌బీఐ అనుమతి ఉన్న సంస్థ అవునా? కాదా? అన్న విషయం తెలుసుకోవాలి. పర్మిషన్ లేని సంస్థలపై ఆర్‌‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా కొన్ని యాప్స్ చట్ట విరుద్ధంగా లోన్స్ ఇస్తుంటాయి. లోన్ ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లించే వరకూ అనేక రకాలుగా ఇబ్బంది పెడతుంటాయి. అందుకే ఆర్‌‌బీఐ రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే లోన్స్ తీసుకోవాలి. ఆర్‌బీఐ గుర్తించని సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోవద్దు.

బ్యాంకులు బెస్ట్

సరైన ఆదాయం, బ్యాంక్ హిస్టరీ ఉన్నవాళ్లకు బ్యాంకులే రుణాలిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా లోన్ అవసరం అయినప్పుడు ఒకసారి బ్యాంకులను సంప్రదించడం మందిచి. బ్యాంకుల్లో అయితే తక్కువ వడ్డీ, తగిన వెసులుబాట్లతో రుణం లభిస్తుంది. బ్యాంకులో లోన్ తీసుకుని నిర్ణీత సమయంలో తిరిగి కట్టేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇది మరోసారి లోన్ తీసుకునేందుకు హెల్ప్ అవుతుంది.

ప్రైవసీ ముఖ్యం

లోన్స్ తీసుకునేముందు తగిన డాక్యుమెంట్ల రూపంలో వ్యక్తిగత వివరాలు అందిచాల్సి ఉంటుంది. యాప్స్ ద్వారా డిజిటల్ లోన్ తీసుకునేటప్పుడు అవసరమైన వివరాలు మాత్రమే అందించాలి. పర్సనల్ డేటా థర్డ్ పార్టీ సంస్థలకు ఇస్తున్నారేమో చెక్ చేసుకోవాలి. ఆర్‌‌బీఐ రిజిస్టర్ అయిన సంస్థలతో అయితే ఇలాంటి సమస్యలు ఉండవు. అలాగే ఆన్‌లైన్‌లో లోన్ అప్లై చేసినప్పుడు వడ్డీ రేట్లు, లేట్ ఛార్జీల వంటివి ముందే తెలుసుకోవాలి. ఈ వివరాలన్ని ఆయా సంస్థల వెబ్‌సైట్లలో లభిస్తాయి.

ఏదేమైనా డిజిటల్‌ లోన్స్ ఈజీగా లభిస్తాయి కదా అని అవసరం లేకపోయినా అప్పు చేయడం మంచిది కాదు. అవసరం ఉండి, తిరిగి చెల్లించేందుకు తగిన మార్గాలు ఉంటేనే లోన్స్ తీసుకోవాలి. అలాగే తీసుకున్న అప్పు లేదా ఈఎంఐలు నిర్ణీత కాలంలో కట్టేస్తూ ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

First Published:  4 Aug 2023 10:44 AM GMT
Next Story