Telugu Global
Science and Technology

డార్క్ థీమ్, న్యూ బటన్స్.. వాట్సాప్ లో కొత్త ఫీచర్లు

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరికొన్ని ఫీచర్స్ అనౌన్స్ చేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే.

కొత్త థీమ్, బిజినెస్ ఇండికేటర్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
X

కొత్త థీమ్, బిజినెస్ ఇండికేటర్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరికొన్ని ఫీచర్స్ అనౌన్స్ చేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే..

వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్‌లో ఉండే ఇబ్బందులు, వాట్సాప్ ఎక్కువసేపు వాడడం వల్ల కళ్లు అలసిపోవడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొన్ని కొత్త మార్పులను తీసుకురాబోతోంది.

ముందుగా వాట్సాప్‌ స్టేటస్‌ని అప్‌డేట్‌ చేసుకోవడంలో ఉండే ఇబ్బందులను సరిచేస్తూ.. కొన్ని మార్పులను తీసుకురానుంది వాట్సాప్. ఇందులో భాగంగా స్టేటస్‌ అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో రెండు అదనపు బటన్లను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. కెమెరా, పెన్సిల్‌ వంటి బటన్స్‌తో ఫొటో, వీడియో సహా ఇతర టెక్ట్స్‌లను స్టేటస్‌ అప్‌డేట్లుగా షేర్‌ చేసేందుకు వీలుంటుంది. అలాగే వాట్సాప్‌ వెబ్‌ వర్షన్‌ నుంచి కూడా ఈజీగా వాట్సాప్‌ స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేసే సమయంలో మ్యూజిక్ లేదా ఆడియోను షేర్ చేసేవిధంగా వాట్సా్ప్ మరో ఫీచర్‌‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ వీడియో కాల్‌లో ఉండగానే ఆడియో క్లిప్, వీడియో క్లిప్ వంటివి పంపుకోడానికి, కాల్‌లో ఉండగానే వాటిని వినడానికి యూజర్లను అనుమతిస్తుంది.

ఇకపోతే వాట్సాప్‌లో ఎక్కువ టైం గడిపేవాళ్లకు కళ్లపై ఒత్తిడి లేకుండా ఉండేలా థీమ్‌లో మార్పులు చేయనుంది వాట్సాప్‌. డార్క్ థీమ్‌తో పాటుగా కొన్ని డిజైనింగ్ మార్పులు కూడా తీసుకురానుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో వాట్సా్ప్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ కొత్త ఇంటర్‌‌ఫేస్‌లో వాట్సాప్‌ స్టేటస్ అప్‌డేట్స్‌ కోసం ఓ కొత్త లేఅవుట్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్లన్నీ టెస్టింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

First Published:  29 Dec 2023 5:30 AM GMT
Next Story