Telugu Global
Science and Technology

వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం క్రేజీ డేటా ప్లాన్స్!

వరల్డ్ కప్ మొదలైందంటే క్రికెట్ ఫ్యాన్స్ అంతా టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోతారు. అయితే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మొబైల్లో డేటా అయిపోకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి డేటా ప్లాన్స్ తీసుకోవాలి. అలాగే మొబైల్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉండాలి. దీనికోసమని ఎయిర్‌‌టెల్, జియో, వీఐ నెట్‌వర్క్‌లు రకరకాల ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచాయి.

వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం క్రేజీ డేటా ప్లాన్స్!
X

వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం క్రేజీ డేటా ప్లాన్స్!

మనదేశంలో క్రికెట్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అయితే త్వరలో క్రికెట్ ప్రపంచకప్​ జరగబోతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెలికాం సంస్థలు క్రేజీ డేటా ప్లాన్స్‌ను ప్రకటించాయి.

వరల్డ్ కప్ మొదలైందంటే క్రికెట్ ఫ్యాన్స్ అంతా టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోతారు. అయితే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మొబైల్లో డేటా అయిపోకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి డేటా ప్లాన్స్ తీసుకోవాలి. అలాగే మొబైల్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉండాలి. దీనికోసమని ఎయిర్‌‌టెల్, జియో, వీఐ నెట్‌వర్క్‌లు రకరకాల ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచాయి. అవేంటంటే..

ఎయిర్​టెల్ ప్లాన్స్

ఎయిర్‌‌టెల్‌లో రూ.499 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో పాటు మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్యాక్‌తో రోజుకి 3 జీబీ డేటా పొందొచ్చు.

ఇక దీంతోపాటు రూ.49 రీఛార్జ్​తో ఒక్కరోజు వ్యాలిడిటీతో కూడిన 6 జీబీ డేటా ప్లాన్, రూ.99 రీఛార్జ్​తో 2 రోజుల అపరిమిత డేటా వంటి ప్లాన్స్ కూడా ఎయిర్‌‌టెల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

జియో ప్లాన్స్

జియోలో రూ.328 బేసిక్​ ప్లాన్​తో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు మూడు నెలల ‘జియో సినిమా’, ‘జియో క్లౌడ్‌’, ‘జియో టీవీ’, ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’ వంటి సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ​ రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది.

రూ.388 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు.

దీంతోపాటు అదనంగా డేటా కావాలనుకుంటే రూ.61కి 6 జీబీ డేటా, రూ.25 కి 2 జీబీ డేటా లభిస్తుంది.

వీఐ ప్లాన్స్

వొడాఫోన్ ఐడియాలో రూ. 399 బేసిక్ ప్లాన్ పై 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకి 2.5జీబీ డేటా లభిస్తుంది. అలాగే మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్‌ పొందొచ్చు.

క్రికెట్ ఆఫర్‌‌లో భాగంగావీఐ.. రూ. 181 డేటా ప్యాక్‌పై డబుల్ డేటా.. అంటే 2 జీబీ (1జీబీ+1జీబీ)డేటాను అందిస్తోంది. అలాగే రూ.151 ప్యాక్ లో నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన 8 జీబీ డేటాతో పాటు మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.

First Published:  10 Oct 2023 11:30 AM GMT
Next Story