Telugu Global
Science and Technology

గూగుల్ లో మీకో గుర్తింపు కావాలంటే..మన గురించి మనకి తెలుసు.. మరి మిగతా వాళ్లకి..

నిజానికి మనం అన్నింటికీ గూగుల్ పైనే ఆధారపడతాం.. అలాంటి గూగుల్ లో మనకో స్థానం ఉంటే.. సూపర్ ఐడియా కదా అలా కోరుకొనే వారికే గూగుల్ ఒక ప్రత్యేకమైన ఫీచర్ను తీసుకొచ్చింది. దీని పేరే పీపుల్ కార్డు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మన గురించిన సమాచారాన్ని క్లియర్ గా చూపించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

గూగుల్ లో మీకో గుర్తింపు కావాలంటే..మన గురించి మనకి తెలుసు.. మరి మిగతా వాళ్లకి..
X

మన గురించి మనం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు. ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో మన గురించి మనమే చెప్పుకోవాలి. మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఇదే పని మనం సోషల్ మీడియా లో చేసాం. బయో రాస్తాం.. కానీ మనం ఎంత రాసినా అది గూగుల్ లో కనపడటం అన్నది డౌటే.

నిజానికి మనం అన్నింటికీ గూగుల్ పైనే ఆధారపడతాం.. అలాంటి గూగుల్ లో మనకో స్థానం ఉంటే.. సూపర్ ఐడియా కదా అలా కోరుకొనే వారికే గూగుల్ ఒక ప్రత్యేకమైన ఫీచర్ను తీసుకొచ్చింది. దీని పేరే పీపుల్ కార్డు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మన గురించిన సమాచారాన్ని క్లియర్ గా చూపించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే ఇది మన దేశంతో పాటు నైజీరియా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ లోనే కాదు హిందీ భాషలో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఇది ఎలా రూపొందించుకోవాలంటే..

ముందుగా స్మార్ట్ ఫోన్లో గూగుల్ యాప్ ని ఓపెన్ చేసి "యాడ్ మీ టు సెర్చ్" అని టైప్ చేయాలి. వెంటనే "ఆడ్ యువర్ సెల్ఫ్ టు గూగుల్ సెర్చ్" అనే విండో ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్లి "గెట్ స్టార్టెడ్" ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో మీ వ్యక్తిగత వివరాలైన పేరు, ప్రాంతం, మీరు చేస్తున్న పని అంటే ఉద్యోగం, బిజినెస్, చదువు, ఈమెయిల్ id , మీ వెబ్సైట్ లాంటివన్నీ ఫిల్ చేయాలి. కావాలనుకుంటే మీ సోషల్ మీడియా అకౌంట్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఇక అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ చూపించాలా వద్దా అన్నది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ చూసి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా కూడా చూసుకొని చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కార్డును సేవ్ చేసుకుంటే చాలు. మన పేరును గూగుల్ సెర్చ్ లో టైప్ చేయగానే సెర్చ్ మన వివరాలున్న గూగుల్ పీపుల్ కార్డ్ ఆన్లైన్లో కనిపిస్తుంది. సూపర్ ఆప్షన్ కదా ఇది... అయితే ట్రై చెయ్యండి మరి.

First Published:  19 July 2023 6:34 PM GMT
Next Story