Telugu Global
Science and Technology

మార్కెట్లోకి కోకకోలా స్మార్ట్ ఫోన్!

ఈ ఏడాది మార్చిలో కోకాకోలా.. స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేస్తుంద‌ని టెక్ వర్గాల్లో టాక్.

మార్కెట్లోకి కోకకోలా స్మార్ట్ ఫోన్!
X

ఎవరి అంచనాలకు అందని విధంగా సాఫ్ట్‌డ్రింక్ కంపెనీ కోకాకోలా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఏడాది మార్చిలో కోకాకోలా.. స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేస్తుంద‌ని టెక్ వర్గాల్లో టాక్. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే..

కోకకోలా స్మార్ట్‌ఫోన్.. తన ఐకానిక్ రెడ్ క‌ల‌ర్‌తో, డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్‌తో, కోకకోలా బ్రాండింగ్‌తో రాబోతోంది. ఈ ఏడాది సమ్మర్‌‌లోపే ఈ మొబైల్ మార్కెట్లోకి రానుంది.

అయితే బేవ‌రేజెస్ రంగంలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న కోకకోలా కంపెనీ ఉన్నట్టుండి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వడం ఏంటి? అనేది చాలామందిని ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇంటర్నెట్‌లో లీకైన ఫొటోలను చూస్తే.. ఇది రియ‌ల్ మీ 10 ప్రో డిజైన్‌ను పోలి ఉన్నట్టు తెలుస్తోంది. ఫోన్ వెనుక‌భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌, డ్యూయ‌ల్‌ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు, ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  26 Jan 2023 2:34 PM GMT
Next Story