Telugu Global
Science and Technology

ఈ ఏడాది సక్సెస్ అయిన ఫోన్స్ ఇవే

Best smartphone 2022: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా లేటెస్ట్ ఫీచర్లతో కొత్తకొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే యుజర్లను అమితంగా ఆకట్టుకోగలిగాయి. యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూస్ ఆధారంగా 2022లో సూపర్ హిట్ అయిన మొబైల్స్ లిస్ట్ ఓసారి చూస్తే..

ఈ ఏడాది సక్సెస్ అయిన ఫోన్స్ ఇవే
X

ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా లేటెస్ట్ ఫీచర్లతో కొత్తకొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే యుజర్లను అమితంగా ఆకట్టుకోగలిగాయి. యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూస్ ఆధారంగా 2022లో సూపర్ హిట్ అయిన మొబైల్స్ లిస్ట్ ఓసారి చూస్తే..

ఈ ఏడాది మోస్ట్ సక్సెస్‌ఫుల్ మొబైల్‌గా ఐఫోన్‌ 14 సిరీస్‌ను చెప్పుకోవచ్చు. నాలుగు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్‌ను కొనేందుకు యూజర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఏ 15, ఏ16 బయోనిక్‌ చిప్స్‌తో వచ్చిన ఈ ఐఫోన్ 14 మొబైల్స్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యాయి. వీటి ధరలు రూ. 79,900 నుంచి రూ.1,39,900దాకా ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్‌ 7: చాలాకాలం తర్వాత గూగుల్ కంపెనీ పిక్సెల్‌ 7 సిరీస్‌ ఫోన్లతో భారత్‌ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది అక్టోబరులో రిలీజైన గూగుల్ పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో ఫోన్లు మంచి రివ్యూస్ ను సాధించాయి. ఇందులో టెన్సర్‌ జీ2 సెకండ్‌ జనరేషన్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు. వీటి ధరలు 59,999నుంచి మొదలవుతాయి.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ : ఈ ఏడాది శాంసంగ్ విడదల గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4 ఫోన్లు భారీగా అమ్ముడయ్యాయి. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో విడుదలైన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు యూజర్ల నుంచి మంచి రీవ్యూలు సాధించాయి. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ వన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోల్డ్ ఫోన్‌ ధర రూ. 1,42,000, ఫ్లిప్ ఫోన్ రూ. 80,000గా ఉంది.

నథింగ్ ఫోన్‌ వన్‌ : ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నథింగ్ మొబైల్.. టెక్‌ లవర్స్‌ను అమితంగా ఆకర్షించింది. ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌, ఎల్‌ఈడీ లైట్లతో ఈ ఫోన్‌ మిగతా ఫోన్ల కంటే ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. దీని ధర రూ. 29,999గా ఉంది.

వన్‌ప్లస్ నార్డ్‌ 2టీ: వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ రేంజ్‌లో వచ్చిన నార్డ్ 2టీ ఫోన్.. ఈ ఏడాది బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్‌లో ఒకటిగా నిలిచింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ధర రూ. 28,999గా ఉంది.

ఐకూ 9టీ 5జీ: స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్ జెన్‌ 1 ప్రాసెసర్‌తో వచ్చిన ఐకూ 9టీ గేమింగ్‌, ఫొటోగ్రఫీ కేటగిరీల్లో బెస్ట్ ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్ ధర రూ. 45,999గా ఉంది.

రియల్‌మీ 9ప్రో+ : మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌తో వచ్చిన రియల్ మీ 9ప్రో.. ఈ ఏడాది బెస్ట్ బడ్జెట్ ఫోన్‌గా మంచి రీవ్యూలను అందుకుంది. ఈ ఆల్‌రౌండర్ ఫోన్ ధర రూ. 24,999గా ఉంది.

First Published:  29 Dec 2022 12:56 PM GMT
Next Story