Telugu Global
Science and Technology

కంటెంట్ క్రియేట్ చేయాలా? ఈ ఏఐ టూల్స్‌పై ఓ లుక్కేయండి!

కంటెంట్ క్రియేషన్‌లో రైటింగ్, ఆడియో క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్.. ఇలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. అయితే అన్ని పనులు ఒకరే చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కంటెంట్ క్రియేటర్లు.. అందుబాటులో ఉన్న ఈ ఏఐ టూల్స్‌ను వాడుకోవచ్చు.

కంటెంట్ క్రియేట్ చేయాలా? ఈ ఏఐ టూల్స్‌పై ఓ లుక్కేయండి!
X

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్స్‌లో చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. ఇలాంటి కంటెంట్ క్రియేటర్లకు పని తగ్గించేలా రకరకాల ఏఐ టూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ఇవీ..

కంటెంట్ క్రియేషన్‌లో రైటింగ్, ఆడియో క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్.. ఇలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. అయితే అన్ని పనులు ఒకరే చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కంటెంట్ క్రియేటర్లు.. అందుబాటులో ఉన్న ఈ ఏఐ టూల్స్‌ను వాడుకోవచ్చు.

చాట్ జీపీటీ

ఎలాంటి టెక్స్ట్ కంటెంట్‌ను అయినా సులభంగా క్రియేట్ చేయగల చాట్ జీపీటీ గురించి అందరికీ తెలిసిందే. అయితే క్రియేటర్లు ఏఐ కంటెంట్‌ను నేరుగా వాడడం వల్ల అంతగా ఉపయోగం ఉండదని గమనించాలి. అందుకే ఏవైనా కొత్త ఐడియాల కోసం లేదా రీసెర్చ్ చేయడం కోసం ఈ టూల్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఫైర్‌‌ఫ్లై

కంటెంట్‌కు తగిన ఇమేజ్‌లు క్రియేట్ చేయడం కోసం ‘అడోబీ​ ఫైర్​ఫ్లై’ అనే ఏఐ టూల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ టూల్ సాయంతో రకరకాల కొత్త ఇమేజ్‌లు, పోస్టర్లు, వెక్టార్ గ్రాఫిక్స్ వంటివి క్రియేట్ చేయొచ్చు.

విడ్ ర్యాపిడ్

వీడియోలోని కంటెంట్‌ను టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేయడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. సదరు లింక్‌తో ఆన్‌లైన్‌లోని ఏ వీడియోకి అయినా ట్రాన్స్‌క్రిప్షన్ పొందొచ్చు. అలాగే వీడియోలోని మొత్తం కంటెంట్‌ను షార్ట్ కంటెంట్ రూపంలోకి కూడా మార్చుకోవచ్చు.

డీప్ ఎల్

‘డీప్‌ ఎల్’ అనే ఏఐ టూల్ సాయంతో ఏదైనా కంటెంట్‌ను మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్​లేట్ చేసుకోవచ్చు. ఇది రకరకాల ఫారిన్ లాంగ్వేజ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

గైడ్

గైడ్ (guidde.com) అనే ఏఐ టూల్ ద్వారా ‘హౌ టు’ గైడ్స్‌ను ప్రిపేర్ చేయొచ్చు. జనరల్ కంటెంట్‌తో పాటు బిజినెస్ ప్రజెంటేషన్స్‌కు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. స్క్రీన్ రికార్డింగ్, టెక్స్ట్‌ టు వాయిస్ ఓవర్, టెక్స్ట్ హైలైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా చేసుకోవచ్చు.

First Published:  4 April 2024 1:30 AM GMT
Next Story