Telugu Global
Science and Technology

రూ.15 వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..

ప్రస్తుతం ఎక్కడచూసినా 5జీ ఫోన్ల హవా నడుస్తోంది. అందుకే మొబైల్ కంపెనీలు కూడా సేల్స్ కోసమని తక్కువ ధరకే 5జీ ఫోన్స్ తీసుకొస్తున్నాయి.

రూ.15 వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..
X

రూ.15 వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..

ప్రస్తుతం ఎక్కడచూసినా 5జీ ఫోన్ల హవా నడుస్తోంది. అందుకే మొబైల్ కంపెనీలు కూడా సేల్స్ కోసమని తక్కువ ధరకే 5జీ ఫోన్స్ తీసుకొస్తున్నాయి. మొదట్లో 5జీ ఫోన్లు కాస్త ఎక్కువ ధర ఉన్నప్పటికీ రోజురోజుకీ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో చూస్తే.. రూ. 15 వేల లోపులోనే బోలెడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 5జీ ఆప్షన్స్‌లో ‘మోటో జీ62 5జీ’ మొబైల్ బెస్ట్ మొబైల్‌గా చెప్పుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.14,999, 6 జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ.13,999గా ఉంది. ఇది ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. వెనుక 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5,000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ మంచి బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో 5జీ స్మార్ట్ ఫోన్ ‘వివో టీ2ఎక్స్ 5జీ’. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో వస్తుంది. ఈ మొబైల్ ధర రూ.13,999గా ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ లో మంచి రేటింగ్స్, రివ్యూస్ కలిగిన మరో మొబైల్ ‘రియల్ మీ 11ఎక్స్’. ఇది 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఇక వీటితో పాటు ‘రెడ్ మీ 12 5జీ’ మొబైల్ రూ.11,999కు, ‘పోకో ఎమ్ 6 5జీ’..రూ.10,999 కు అందుబాటులో ఉన్నాయి. అలాగే 108 ఎంపీ ఏఐ కెమెరాతో వస్తున్న ‘ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ’.. రూ.14,999కు అందుబాటులో ఉంది. వీటితోపాటు ‘శాంసంగ్ ఎమ్ 14 5జీ’, ‘శాంసంగ్ ఎఫ్ 23 5జీ’, ‘శాంసంగ్ ఎమ్ 13 5జీ’ కూడా రూ.15,000 లోపు ధరల్లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పుకోవచ్చు.

First Published:  18 Sep 2023 4:30 AM GMT
Next Story