Telugu Global
Science and Technology

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ వచ్చేసింది! కొత్త రూల్స్ ఇవే..

గేమర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్యాటిల్‍గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ ఎట్టకేలకు ఇండియాలో రీలాంచ్ అయింది.

Battlegrounds Mobile India: బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ వచ్చేసింది! కొత్త రూల్స్ ఇవే..
X

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ వచ్చేసింది! కొత్త రూల్స్ ఇవే..

గేమర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్యాటిల్‍గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ ఎట్టకేలకు ఇండియాలో రీలాంచ్ అయింది. బ్యాన్ అయిన ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గేమ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ గేమ్ కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కొన్ని రూల్స్ పెట్టింది. అవేంటంటే..

బీజీఎంఐ గేమ్ కు ప్రస్తుతానికి మూడు నెలల పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత గేమ్ ఉంచాలా? మళ్లీ బ్యాన్ చేయాలా అన్నది నిర్ణయిస్తారు.

బీజీఎంఐ గేమ్ కు డైలీ టైం లిమిట్ ఉంటుంది. యూజర్ల వయసుని బట్టి ఈ టైమ్ లిమిట్ ఉంటుంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు రోజుకి ఆరు గంటల పాటు ఆడుకోవచ్చు. ఆరు గంటల తర్వాత గేమ్ కంటిన్యూ చేయలేరు. అలాగే 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న పిల్లలు రోజుకి మూడు గంటలు మాత్రమే గేమ్ ఆడే వీలుంది. చిన్న పిల్లలు గేమ్ ఆడేందుకు పేరెంటర్ వెరిఫికేషన్ కూడా అవసరం.

ఇకపోతే కొత్త బీజీఎంఐ వెర్షన్‍లో ‘నుసా’ అనే కొత్త మ్యాప్ యాడ్ అయ్యింది. దీంతో పాటు మెరుగైన కొత్త గ్రాఫిక్స్, లేటెస్ట్ ఫీచర్స్‌ను కూడా గేమ్‌లో యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ గేమ్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.

Next Story