Telugu Global
Science and Technology

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పొలిటికల్ పార్టీ

మనకు రకరకాల పొలిటికల్ పార్టీలు తెలుసు. కానీ, అధినేత, కార్యకర్తలు లేని రాజకీయ పార్టీని ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి ఒక పార్టీ డెన్మార్క్‌లో ఉంది. 'డేనిష్ సింథటిక్ పార్టీ'గా పిలిచే ఈ పార్టీకి మనుషులతో పని లేదు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పొలిటికల్ పార్టీ
X

మనకు రకరకాల పొలిటికల్ పార్టీలు తెలుసు. కానీ, అధినేత, కార్యకర్తలు లేని రాజకీయ పార్టీని ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి ఒక పార్టీ డెన్మార్క్‌లో ఉంది. 'డేనిష్ సింథటిక్ పార్టీ'గా పిలిచే ఈ పార్టీకి మనుషులతో పని లేదు. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో రాజకీయాలు చేస్తుంది.

సైంటిస్టులు పెద్దపెద్ద సమస్యలను చిటికెలో పరిష్కరించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు డెన్మార్క్ దేశంలో నడుస్తున్న రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. 'మైండ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌' అనే స్వచ్ఛంద సంస్థ 'కంప్యూటర్‌ లార్స్‌' ద్వారా సృష్టించిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పార్టీ ఈ ఏడాది మే నెలలో ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డెన్మార్క్ సింథటిక్ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది.

డెన్మార్క్‌ ఎన్నికల్లో పోటీ చేస్తూ 1970ల నుంచి ఇప్పటివరకు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన రాజకీయ పార్టీల సిద్ధాంతాలన్నింటినీ ప్రోగ్రామ్‌ చేసి సరైన సిద్ధాంతాలను రూపొందిస్తూ ఈ పార్టీని డెవలప్ చేశారు. ఎన్నికల్లో ఇప్పటివరకూ ఓటు వేయని 20 శాతం డెన్మార్క్‌ ఓటర్లపై ఈ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఆస్కార్ స్టోన్. పార్టీ లీడర్ పేరు లార్స్. అతనొక చాట్ బాట్ నాయకుడు. ఈ చాట్ బాట్ నాయకుడు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా వ్యక్తులతో మాట్లాడగలడు. మరి ఈ రోబోటిక్ నేత ఎన్నికల్లో గెలుస్తాడో లేదో చూడాలి.

First Published:  9 Nov 2022 8:30 AM GMT
Next Story