Telugu Global
Science and Technology

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్.. ఈ ఫోన్లపై మంచి ఆఫర్లు!

ఈ నెలలో రానున్న సంక్రాంతి, రిపబ్లిక్ డే లను దృష్టిలో ఉంచుకుని ఇ–కామర్స్ సంస్థలు డిస్కౌంట్ సేల్స్ ప్రకటించాయి.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్.. ఈ ఫోన్లపై మంచి ఆఫర్లు!
X

ఈ నెలలో రానున్న సంక్రాంతి, రిపబ్లిక్ డే లను దృష్టిలో ఉంచుకుని ఇ–కామర్స్ సంస్థలు డిస్కౌంట్ సేల్స్ ప్రకటించాయి. ఇందులో ఐఫోన్, పిక్సెల్ సహా పలు స్మార్ట్ ఫోన్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

జనవరి 13 మధ్యాహ్నం నుంచి అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్, జనవరి 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్స్‌ షురూ కానున్నాయి. వీటిలో ఏయే ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉండనున్నాయంటే..

జనవరి 14 నుంచి 19 వరకూ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తుంది. ఇందులో ఐఫోన్ 15, పిక్సెల్ 8 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 తోపాటుగా గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 , మోటోరోలా ఎడ్జ్ 40 నియో, గూగుల్ పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, వివో టీ2ఎక్స్, ఒప్పో రెనో 10 ప్రో, పోకో ఎక్స్5, రియల్‌మీ 11, రెడ్‌మీ12 వంటి ఫోన్లపై భారీ తగ్గింపు ఉండనుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అలాగే కొత్తగా రిలీజయ్యే ఫోన్లపై కూడా డిస్కౌంట్ ఉండనున్నట్లు వెల్లడించింది.

వీటితోపాటు ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం... హోమ్ అప్లయెన్సస్‌పై 75 శాతం వరకు ఆఫర్లు ఉండనున్నాయి. బ్యూటీ, ఫుడ్‌, టాయ్స్‌పై 85 శాతం వరకు, ఫర్నిచర్‌లపై 80 శాతం వరకు పొందొచ్చు.

ఇక అమెజాన్ విషయానికొస్తే.. జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ మొదలవుతుందని అమెజాన్‌ ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఫోన్‌ యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై కూడా పలు డిస్కౌంట్స్ ఉండనున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు.

ఈ సేల్‌లో ఐఫోన్‌ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23, శాంసంగ్‌ గెలాక్సీ ఏ34, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3లైట్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 3, వన్‌ప్లస్‌ 11, మోటోరొలా రేజర్‌ 40 అల్ట్రా, ఐకూ 12, రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ 5జీ, లావా బ్లేజ్‌ 5జీ, ఐకూ జెడ్7 ప్రో, హానర్ 90 వంటి ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు ఉండనున్నాయి.

First Published:  11 Jan 2024 11:27 AM GMT
Next Story