Telugu Global
Science and Technology

స్పామ్‌కాల్స్‌, మెసేజ్‌లకు చెక్‌ పెట్టనున్న ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వాడే స్మార్ట్‌ఫోన్‌ యూజర్లందరికీ సెప్టెంబర్‌ 26 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సదుపాయం

స్పామ్‌కాల్స్‌, మెసేజ్‌లకు చెక్‌ పెట్టనున్న ఎయిర్‌టెల్‌
X

స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ల సమస్యలకు చెక్‌ పెట్టడానికి ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ సిద్ధమైంది. కొన్నేండ్లుగా టెలికాం యూజర్లను తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో చెక్‌ పెట్టేందుకు కొత్త టెక్నాలజీని రూపొందించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 26 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. స్పామ్‌కాల్స్‌, మెసేజ్‌ల గురించి ఈ సదుపాయం యూజర్లను అలెర్ట్‌ చేస్తుందన్నారు. స్పామ్‌ కాల్స్‌పై చర్యలు తీసుకుంటున్న మొదటి నెట్‌వర్క్‌ తమదేనని ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ పేర్కొన్నది.

దేశంలో 60 శాతం మంది భారతీయులు సగటున రోజుకు మూడు స్పామ్‌ కాల్స్‌ అందుకుంటున్నారని ఎయిర్‌టెల్‌ పేర్కొన్నది. దీనివల్ల టెలికాం యూజర్ల సమయం వృథా అవుతున్నది. దీంతోపాటు కొన్నిసార్లు స్కామ్‌లకు కూడా దారితీస్తున్నాయని తెలిపింది. వీటిని అడ్డుకునే దిశగా ఎయిర్‌టెల్‌ ఈ ప్రయత్నం మొదలుపెట్టిందని గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు. తమ ఏఐ ఆధారిత స్పామ్‌ డిటెక్షన్‌ సొల్యూషన్‌ కేవలం 2 సెకన్లలోనే స్పామ్‌ను గుర్తించి యూజర్‌ను డైలర్‌పై అలర్ట్‌ చేస్తుందన్నారు. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వాడే స్మార్ట్‌ఫోన్‌ యూజర్లందరికీ ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందించనున్నట్లు చెప్పారు.

First Published:  25 Sept 2024 8:27 AM GMT
Next Story