Telugu Global
Science and Technology

వాట్సాప్ సేఫ్టీ కోసం 10 చిట్కాలు!

WhatsApp security tips: ఈ రోజుల్లో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల్లో ఎక్కువ శాతం స్కామ్‌లు వాట్సాప్ వేదికగానే జరుగుతున్నాయి. అందుకే వాట్సాప్ యూజర్లు కొన్ని సేఫ్టీ రూల్స్‌ను తప్పక పాటిస్తుండాలి.

వాట్సాప్ సేఫ్టీ కోసం 10 చిట్కాలు!
X

ఈ రోజుల్లో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల్లో ఎక్కువ శాతం స్కామ్‌లు వాట్సాప్ వేదికగానే జరుగుతున్నాయి. అందుకే వాట్సాప్ యూజర్లు కొన్ని సేఫ్టీ రూల్స్‌ను తప్పక పాటిస్తుండాలి. వాట్సాప్‌లో సేఫ్‌గా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలుతీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌లో ఫిషింగ్ మెసేజ్‌లు, ఫేక్ జాబ్ ఆఫర్లతో పాటు ఫేక్ లింక్‌ల వంటివి కూడా ఇటీవల ఎక్కువయ్యాయి. తమకు తెలియని నెంబర్లు, అకౌంట్ల నుంచి కూడా పలు మెసేజ్‌లు వస్తుండడంతో యూజర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. వీటిబారి నుంచి ఎలా బయటపడాలంటే..

పది కంటే ఎక్కువ సంఖ్యలున్న నెంబర్ల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ మెసేజ్‌లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పలు ఆన్‌లైన్ సైట్ల నుంచి మన నెంబర్లు సేకరించి మార్కెటింగ్ చేస్తుంటాయి కొన్ని సంస్థలు. ఇలాంటి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. వాటిని వెంటనే బ్లాక్ చేయాలి.

జాబ్ ఆఫర్లు, సర్వేల పేరుతో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు రెస్పాండ్ కాకపోవడమే మంచిది. అటువంటి నెంబర్లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేసేస్తే మంచిది.

ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్ ల్లోని లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆఫర్ నిజమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు ఆయా సంస్థల ఒరిజినల్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

మీ వ్యక్తిగత వివరాలను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోకపోవడమే మంచిది. మీరు పంపేది మీ సన్నిహితులకే అయినా ఎప్పుడైనా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు సెన్సిటిన్ ఇన్ఫర్మేషన్ దొంగల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

వాట్సాప్ లాగిన్ చేసేందుకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ‘ఆన్‌’లో ఉంచుకోవడం ముఖ్యం. దీనివల్ల అకౌంట్ మరింత సేఫ్‌గా ఉంటుంది. దీనికోసం అకౌంట్ సెట్టింగ్స్‌లో ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి.

వాట్సాప్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంచుకోవాలి. యాప్ సెట్టింగ్స్‌లో ఆటో అప్‌డేట్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవడం ద్వారా ఆటోమెటిక్‌గా యాప్ అప్‌డేట్ అవుతూ ఉంటుంది.

వాట్సా్ప్ సెక్యూరిటీకి సంబంధించిన కొత్త అప్‌డేట్స్, ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా ముఖ్యమైన సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకునే వీలుంటుంది.

వాట్సాప్‌లో వచ్చిన మార్పుల గురించి తెలియజేసేందుకు వాట్సాప్ సంస్థ స్టేటస్ రూపంలో నోటిఫికేషన్స్ ఇస్తుంటుంది. వాటిని పూర్తిగా చదివితే యాప్‌లో వచ్చిన కొత్త మార్పులు తెలుస్తాయి.

ఇతరుల ల్యా్ప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌పై వాట్సాప్ లాగిన్ చేసినప్పుడు మర్చిపోకుండా వెంటనే లాగవుట్ చేసేయాలి.

వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ‘షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ఆన్ దిస్ ఫోన్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి.

First Published:  14 Jan 2024 3:14 AM GMT
Next Story