సమ్మర్‌లో వెళ్లాల్సిన కూల్ ప్లేసులివే!

సమ్మర్ సెలవుల్లో..
సమ్మర్ సెలవుల్లో టూర్ వెళ్లాలనుకునేవాళ్లు వేసవిలో చల్లని అనుభూతినిచ్చే కూల్ డెస్టినేషన్స్‌ను ఎంచుకుంటుంటారు. అలాంటి కొన్ని చల్లని ప్రాంతాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
డార్జిలింగ్
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్ హిల్ స్టేషన్.. హిమాలయాలకు దిగువన ఎంతో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ సమ్మర్‌‌లో కూడా చల్లనిగాలులు వీస్తాయి. సమ్మర్ టూర్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.
మున్నార్
కేరళలోని మున్నార్‌ హిల్ స్టేషన్ సమ్మర్‌‌లో వెళ్లాల్సిన మరో బెస్ట్ ప్లేస్. ఎత్తైన కొండల మధ్య పచ్చని టీ తోటల మధ్య చల్లని వాతావరణాన్ని ఇక్కడ ఆస్వాదించొచ్చు.
లంబసింగి
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ వెకేషన్ వెళ్లాలంటే.. అరకులోయకు దగ్గర్లో ఉన్న లంబసింగి వెళ్లొచ్చు. దీన్ని ఆంధ్రా కశ్మీర్ అంటారు. ఇక్కడ చుట్టూ ఉండే పచ్చని కొండల వల్ల వేసవిలో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది.
కశ్మీర్
వేసవిలో తప్పక విజిట్ చేయాల్సి ప్లేస్‌ల్లో కశ్మీర్ ఒక‌టి. సమ్మర్‌లో కూడా మంచుని ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే ఇక్కడికి వెళ్లొచ్చు.
ఊటీ, కొడైకెనాల్
తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలు కూడా సమ్మర్‌‌లో చల్లగా ఉంటాయి. ఫ్యామిలీ ట్రిప్స్ లేదా హనీమూన్‌కి ఇవి బెస్ట్.
జాగ్రత్తలు మస్ట్
సమ్మర్‌‌లో టూర్ వెళ్లేటప్పుడు వెళ్లబోయే ప్రాంతం, అక్కడి వాతావరణం గురించి ముందుగా తెలుసుకుని వెళ్లడ ముఖ్యం. అలాగే తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.