సమ్మర్‌‌లో ఎలాంటి బట్టలు వేసుకోవాలంటే

వేడి తట్టుకోవాలంటే..
ఎండలు ముదురుతున్న ఈ సమయంలో బయటకు వెళ్లాలంటే ఎవరికైనా చిరాకే. అందుకే ఈ సీజన్‌లో చెమట, వేడిని ఎదుర్కొనేలా సరైన దుస్తులు వేసుకోవడం ద్వారా ఈ ఉక్కపోత నుంచి కొంతైనా రిలీఫ్ పొందొచ్చు. అదెలాగంటే..
షార్ట్ అండ్ లూజ్
సమ్మర్‌‌లో ఫుల్ స్లీవ్స్, స్కిన్ టైట్ ప్యాంట్స్‌ లాంటివి వేసుకోవడం ద్వారా శరీరానికి సరిగా గాలి ఆడదు. కాబట్టి కాస్త వదులుగా, చర్మానికి గాలి ఆడేలా ఉండే దుస్తులను ఎంచుకోవాలి.
కలర్స్ ఇలా..
సమ్మర్‌‌లో వీలైనంత వరకూ లైట్ కలర్స్ ఎంచుకుంటే కొంతవరకూ వేడి నుంచి తప్పించుకోవచ్చు. నలుపు లేదా డార్క్ షేడ్స్‌లో ఉండే రంగులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. కాబట్టి అలాంటి రంగుల బట్టలు వేసుకోకపోవడం బెటర్.
ఫ్యాబ్రిక్ ఇలా..
సమ్మర్‌‌లో సిల్క్, పాలిస్టర్ వంటి ఫ్యాబ్రిక్స్ వాడడం ద్వారా చర్మానికి మరింత ఇరిటేషన్ కలుగుతుంది. కాబట్టి సమ్మర్‌‌లో వాటికి బదులు కాటన్, లెనిన్ వంటి దుస్తులను వాడితే చాలా వరకూ రిలీఫ్ ఉంటుంది.
జీన్స్‌ వద్దు
సమ్మర్‌‌లో జీన్స్ బట్టలను పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అత్యంత మందంగా ఉండే ఈ ఫ్యాబ్రిక్ మెటీరియల్ చర్మానికి గాలి తగలకుండా చేస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో జీన్స్‌ వద్దు.
గొడుగు వాడితే..
సమ్మర్‌‌లో ఎండ నుంచి తప్పించుకోవడానికి గొడుగు బెస్ట్ టెక్నిక్. చాలామంది వర్షాకాలం మాత్రమే గొడుగు వాడుతుంటారు. కానీ, సమ్మర్‌‌లో కూడా గొడుగు ఎంతో యూజ్ ఫుల్‌గా ఉంటుంది. తెలుపు రంగు గొడుగు అయితే సమ్మర్‌‌లో ఇంకా బెస్ట్.
ఇవి వద్దు
సమ్మర్‌‌లో షూ, సాక్స్ వంటివి వాడడం వల్ల శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. కాబట్టి సమ్మర్‌‌లో కాళ్లకు గాలి ఆడేలా శాండిల్స్ లేదా బ్రీతబుల్ షూస్ వంటివి ధరించడం ఉత్తమం. అలాగే తలకు పెట్టుకునే టోపీ కూడా వదులుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.