రైస్ మానేస్తే శరీరంలో జరిగేది ఇదే!

షుగర్‌‌కు కారణం
మన దేశంలో షుగర్ సమస్య పెరగడానికి రైస్ కారణమవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అసలు రైస్‌తో సమస్యేంటి? రైస్ మానేస్తే ఏం జరుగుతుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలరీలు ఎక్కువ
బియ్యంలో పోషకాలు తక్కువగా , పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తక్షణ శక్తి లభించడంతోపాటు రక్తంలో షుగర్ లెవల్స్ కూడా అమాంతం పెరుగుతున్నాయి.
ఇవి మేలు
వైట్ రైస్ తినే వాళ్లు దాన్ని మానేసి బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్, గోధుమలు, మిల్లెట్స్ వంటి వాటిని ప్రధానమైన మీల్‌గా మార్చుకుంటే శరీరంలో బోలెడు మార్పులు చోటుచేసుకుంటాయి.
గుండె సేఫ్
వైట్ రైస్ మానేస్తే వెంటనే బరువు తగ్గడం మొదలవుతుంది. కొలెస్ట్రాల్‌ లెవల్స్, షుగర్ లెవల్స్ కూడా మెల్లగా కంట్రోల్‌లోకి వస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
డయాబెటిస్ కంట్రోల్
బ్రౌన్ రైస్, రెడ్ రైస్, మిల్లెట్స్ వంటి వాటిని మెయిన్ మీల్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో ఫైబర్ కంటెంట్ పెరిగి ఆకలి తగ్గుతుంది. షుగర్ వెంటనే కంట్రోల్‌లోకి వస్తుంది. శరీరానికి ‘బి’ కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా అందుతాయి.
బరువు తగ్గొచ్చు
‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం’ రిపోర్ట్ ప్రకారం ఒబెసిటీ ఉన్న వాళ్లు నెల రోజుల పాటు వైట్ రైస్ మానేస్తే 2 లేదా 3 కిలోల బరువు తగ్గుతారట.
ఇలా తినాలి
రైస్ మానేయడం అంటే అన్నం పూర్తిగా మానేయడం కాదు. తెల్ల అన్నానికి బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, మిల్లెట్ రైస్ వంటి వాటిని ఆల్టర్నేటివ్‌గా తీసుకోవాలి. ఏదేమైనా కొత్తగా డైట్‌ మార్చేవారు డాక్టర్ల సలహా కూడా తీసుకుంటే మంచిది.