కూల్ వాటర్‌‌ అతిగా తాగితే జరిగేది ఇదే!

నష్టాలూ ఉన్నాయ్
సమ్మర్‌‌లో చాలామంది బాగా చల్లగా ఉన్న ఐస్ వాటర్ తాగుతుంటారు. అయితే కూల్ వాటర్‌‌ వల్ల గొంతుకి హాయిగా అనిపించినా అదేపనిగా కూల్ వాటర్ తాగడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
కఫం పెరిగి..
చల్లటి నీటిని తాగడం వల్ల శ్లేష్మం(కఫం) ఎక్కువగా తయారవుతుంది. దీనివల్ల శ్వాస సమస్యలు, జలుబు, దగ్గు వంటివి వస్తాయి. ఆస్తమా ఉన్నవారికి మరింత ఇబ్బందిగా ఉంటుంది.
తలనొప్పి
తలనొప్పి సమస్య ఉన్నవాళ్లు చల్లటి నీటిని తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఐస్ వాటర్‌‌తో మైగ్రేన్‌ సమస్య ఎక్కువ అవ్వొచ్చు.
డైజెషన్ ప్రాబ్లమ్
ఆహారం తిన్న తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఈ అలవాటు వల్ల కొంతమందిలో కడుపు నొప్పి, విరేచనాలు వంటివి కూడా రావొచ్చు.
మెటబాలిజం తగ్గి..
బాగా చల్లగా ఉన్న వాటర్ తాగడం వల్ల శరీర వ్యవస్థ ఒక్కసారిగా షాక్‌కు గురువుతుంది. తద్వారా రక్త ప్రసరణ, శ్వాస వ్యవస్థలో మార్పులొస్తాయి. ఇది క్రమంగా మెటబాలిజం, ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి కారణమవుతుంది.
ఇవి కూడా
తరచూ ఐస్ వాటర్ తాగే అలవాటు వల్ల దంతాల సున్నితత్వం దెబ్బ తింటుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒత్తిడి వంటివి కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇలా తాగాలి
సమ్మర్‌‌లో చల్లని నీరు తాగాలని అనిపించినప్పుడు ఐస్ వాటర్‌‌లో మామూలు వాటర్ కలుపుకుని తాగొచ్చు. అలాగే ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నార్మల్ వాటర్‌‌నే ప్రిఫర్ చేయడం బెటర్.