విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే

విటమిన్ బి 12 మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి మాత్రమే మనకు లభిస్తుంది ఎందుకంటే విటమిన్ బి 12 శరీరం సొంతంగా తయారు చేయలేని ముఖ్యమైన పోషకం.
గుడ్డు
గుడ్లలో ప్రోటీన్‌తో పాటు, అనేక ప్రయోజనకరమైన విటమిన్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి విటమిన్ బి -12. కోడిగుడ్డు తెల్లసొనలో కన్నా పచ్చసొనలో అధిక మొత్తంలో విటమిన్ బీ 12 లభిస్తుంది.
చేపలు
చేపల్లో విటమిన్ బి12 అధికంగా లభిస్తుంది. ట్యూనా, సాల్మన్, సార్డినెస్ , ట్రౌట్ వంటి వివిధ రకాల చేపలను ఆహారంగా తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన బి 12 విటమిన్ అందుతుంది.
పాలు
పాల ద్వారా విటమిన్ బి 12 లభిస్తుంది. అందుకే వైద్య నిపుణులు బి 12 లోపాన్ని నివారించటానికి ప్రతిరోజు పాలు తాగమని సూచిస్తుంటారు. పాలు తాగటం వల్ల అదనంగా కాల్షియంతోపాటు, విటమిన్ డి కూడా లభిస్తాయి.
చికెన్
చికెన్ లో ఎక్కవ ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. విటమిన్ బి12 శరీరానికి సమకూరాలంటే అప్పుడప్పుడు చికెన్ ను తీసుకోవటం మంచిది.
తృణధాన్యాలు
అత్యంత బలవర్ధకమైన ఆహారంగా చిరు,తృణ ధాన్యాల ఆహారాలను చెప్పవచ్చు, శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లు, ప్రొటీన్లు ఇందులో లభిస్తాయి. విటమిన్ బి12 ఎక్కవగా వీటిని ఆహారంగా తీసుకోవటం ద్వారా లభిస్తుంది.