విక్రమ్-ఎస్ గురించి ఆసక్తికర విషయాలు - భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ రాకెట్
శుక్రవారం (నవంబర్ 18, 2022)న ఉదయం 11.30 గంటలకు ఇస్రో శ్రీహరికోట నుంచి రాకెట్ విజయవంతంగా ప్రయోగించింది.
విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీ అభివృద్ధి చేసింది.
మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్.
నాగ భరత్ డాకా (32), పవన్ కుమార్ చందన (31) భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను అభివృద్ధి చేసారు.
భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా ఈ రాకెట్‌కు 'విక్రమ్-ఎస్' అని పేరు పెట్టారు.
విక్రమ్-ఎస్ 89.5 కి.మీ ఎత్తుకు ప్రయాణించింది.
విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు.