వాలంటైన్ వీక్ గురించి తెలుసా?

వారం రోజుల సెలబ్రేషన్
ప్రేమికులకు ఫిబ్రవరి 14 చాలా స్పెషల్. అయితే ప్రేమికులు వాలంటైన్స్ డే వారం ముందు నుంచే మొదలవుతుంది. దీన్నే వాలెంటైన్ వీక్ అంటారు. దీన్ని వెస్టర్స్ కల్చర్‌‌లో ఎక్కువగా జరుపుకుంటారు. ఇందులో ఒక్కోరోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది.
రోజ్ డే
వాలంటైన్ వీక్ ‘రోజ్‌డే’తో మొదలవుతుంది. ఫిబ్రవరి 7న ప్రేమికలు తమ ప్రేమను వ్యక్తం చేస్తూ గులాబీలను ఇచ్చిపుచ్చుకునే రోజు ఇది.
ప్రపోజ్ డే
ఫిబ్రవరి 8న ‘ప్రపోజ్ డే’. అంటే ప్రేమించిన వారితో తమ ప్రేమను వ్యక్తపరిచే రోజు. ఈ రోజున ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారన్న మాట.
చాక్లెట్ డే
ప్రేమను వేడుకగా జరుపుకునేందుకే ఈ ‘చాక్లెట్ డే’. ఫిబ్రవరి 9న ప్రేమికులు ఒకరికొకరు చాక్లె్ట్స్ ఇచ్చిపుచ్చుకుని సెలబ్రేట్ చేసుకుంటారు.
టెడ్డీ డే
ఫిబ్రవరి10న ‘టెడ్డీ డే’. తమ పార్ట్‌నర్‌‌కు గిఫ్ట్ ఇచ్చే రోజు ఇది. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే టెడ్డీబేర్‌‌ను వారికి గిఫ్ట్‌గా ఇస్తుంటారు అబ్బాయిలు.
ప్రామిస్ డే
ఫిబ్రవరి 11న ‘ప్రామిస్‌ డే’. అంటే ఒకరికొకరు తోడుంటామని ప్రామిస్ చేసుకునే రోజు.
హగ్ డే
ఫిబ్రవరి 12న ‘హగ్ డే’. అంటే తమ ప్రేమను కౌగిలింత ద్వారా వ్యక్తపరిచే రోజు.
కిస్ డే
ఫిబ్రవరి 13న ‘కిస్‌ డే’. ఈ రోజున ప్రేమికులు తమ ప్రేమను ముద్దు ద్వారా తెలియజేస్తారు.
వాలెంటైన్స్ డే
ఇక చివరిగా ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ఇది ప్రేమకు ఒక ముడి వేసే రోజు. ఈ రోజున చాలామంది పెళ్లి లేదా ఎంగేజ్‌మెంట్ వంటివి చేసుకుంటారు.