టీఎస్ ఎంసెట్‌ రిజల్ట్స్ 2023: మే 25 ఉదయం 9.30 గంటలకు ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఎంసెట్ ఫలితాలను మే 25న గురువారం ఉదయం 9:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేస్తారు.
ఇటీవల ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్లు విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.