కారు కొంటున్నారా? సేఫ్టీ రేటింగ్ ఉన్న బలమైన కార్లు ఇవే!

గ్లోబల్ రేటింగ్
కారు కొనేముందు అందులో ఉండే ఫీచర్లతో పాటు దాని సేఫ్టీ రేటింగ్ ఎంత అనేది కూడా చూసుకోవాలి. కారుని బలంగా క్రాష్ చేసి.. దాని సామర్ధ్యాన్ని బట్టి సేఫ్టీ రేటింగ్స్ ఇస్తారు. 5 స్టార్ రేటింగ్ ఉంటే సేఫ్ కార్ అన్నట్టు లెక్క. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సేఫెస్ట్ కార్లు ఇవే.
టాటా పంచ్, టాటా నెక్సాన్
1.2 లీటర్ ఇంజిన్ ఉన్న టాటా పంచ్, టాటా నెక్సాన్ కార్లు గ్లోబల్ సేఫ్టీ టెస్ట్ లో 5 స్టార్స్ సాధించాయి. పంచ్ కారు ధర రూ. 6 లక్షలు, నెక్సాన్ ధర రూ.7.7 లక్షల నుంచి మొదలవుతుంది.
మహింద్రా ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 700
గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌లో మహింద్రా ఎక్స్‌యూవీ 300 , ఎక్స్‌యూవీ 700 కార్లు 5 స్టార్స్ సాధించాయి. 1.2 లీటర్ ఇంజిన్ కలిగిన ఎక్స్‌యూవీ 300 ధర రూ. 8.4 లక్షల నుంచి మొదలవుతుంది. 2.0 లీటర్ ఇంజిన్ కలిగిన ఎక్స్‌యూవీ 700 ధర రూ. 13 లక్షల నుంచి మొదలవుతుంది.
హ్యుందాయ్ వెర్నా
1.4 లీటర్ ఇంజిన్ కలిగిన హ్యుందాయ్ వెర్నా సెడాన్ కారు.. 5 స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి మొదలవుతుంది.
ఫోక్స్‌వాగన్ టైగున్
1.4 లీటర్ ఇంజిన్ కలిగిన ఫోక్స్ వాగన్ టైగున్ కారు 5 స్టార్ల గ్లోబర్ సేఫ్టీ రేటింగ్ పొందింది. దీని ధర రూ. 11లక్షల నుంచి మొదలవుతుంది.
స్కోడా కుషక్
1.5 లీటర్ స్కోడా కుషక్ కారు గ్లోబర్ సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్స్ పొందింది. దీని ధర రూ. 11 లక్షల నుంచి మొదలవుతుంది.
టాటా హ్యారియర్, సఫారీ
టాటా హ్యారియర్, సఫారీ కార్లు్ ప్రస్తుతం ఇండియాలోనే సేఫెస్ట్ కార్లు. 60 కి.మీ స్పీడ్‌తో కారు ఏ యాంగిల్‌లో డ్యాష్ ఇచ్చినా లోపల ఉన్నవాళ్లు దాదాపు సేఫ్‌గా ఉంటారు. గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్స్ పొందిన ఈ కార్లు 2.0 లీటర్ ఇంజిన్‌తో వస్తాయి. ధరలు రూ. 15 లక్షల నుంచి మొదలవుతాయి.
మహింద్రా స్కార్పియో
ఇండియాలోని సేఫెస్ట్ కార్స్‌లో మహింద్రా స్కార్పియో కూడా ఒకటి. 2.0 లీటర్ ఇంజిన్ ఉన్న ఈ కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ధర రూ. 12 లక్షల నుంచి మొదలవుతుంది. ఇకపోతే మహింద్రా థార్ కారు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది.