సమ్మర్‌లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవే

ఎర్లీ ఎండలు
చూస్తుండగానే చలికాలం ముగిసింది. ఫిబ్రవరి నుంచే ఎండ సెగలు మొదలయ్యాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు పెరిగినట్టు రిపోర్ట్‌లు చెప్తున్నాయి. మరి సమ్మర్‌‌లో ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..
నీళ్లు ముఖ్యం
వాతావరణంలో వేడి పెరగగానే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఈ సీజన్‌లో నీళ్లు ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. లేకపోతే డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.
చర్మ సమస్యలు
సమ్మర్‌లో చర్మంపై చెమట పెరుగుతుంది. తద్వారా కొంతమందికి ర్యాషెస్ వంటివి వస్తుంటాయి. కాబట్టి సమ్మర్‌‌లో రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేయాలి. తరచూ ఫేస్ వాష్ చేసుకోవాలి. కాటన్ బట్టలు వేసుకోవాలి.
ఆహారం జాగ్రత్త
సమ్మర్‌‌లో ఆహారపదార్థాలు అంతగా నిల్వ ఉండవు. త్వరగా పాడవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువే. కాబట్టి ఈ సీజన్‌లో వీలైనంతవరకూ తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి.
జ్వరాలు
సమ్మర్‌‌లో బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు, కామెర్ల వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి కలుషితం లేని నీటిని తాగాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి.
వడ దెబ్బ
రానున్న పీక్ సమ్మర్‌‌లో వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. వీలైనంత వరకూ నీడ పట్టున ఉండాలి.
ఇవి కూడా
సమ్మర్‌‌లో వీలైనంత వరకూ నీటిశాతం ఎక్కువ ఉండే పండ్లు తీసుకోవాలి. బయటకు వెళ్లే ప్రతీసారి వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. చర్మం పాడవ్వకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి.