లంగ్స్‌ను క్లీన్ చేసే ఫుడ్స్ ఇవే

లంగ్స్ డీటాక్స్
రకరకాల కారణాల వల్ల చాలామంది ఊపిరితిత్తులు పాడవుతూ ఉంటాయి. స్మోకింగ్, పొల్యూషన్, ఆస్తమా వంటి సమస్యల కారణంగా ఇది మరింత ఎక్కువ అవుతుంది. అయితే ఇలాంటి వాళ్లంతా కేవలం కొన్ని ఫుడ్స్ ద్వారా లంగ్స్‌ను క్లీన్ చేసుకోవచ్చు. అవేంటంటే..
అల్లం
లంగ్స్ డీటాక్స్ చేసేవాటిలో అల్లం ముఖ్యమైనది. ఇందులో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు రెస్పిరేటరీ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. అల్లం రోజూ తీసుకుంటుంటే లంగ్స్ మెల్లగా డీటాక్స్ అవుతాయి.
పసుపు
పసుపులో ఉండే ‘సర్కుమిన్’ అనే యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ ఊపిరితిత్తుల్లో జరిగిన టిష్యూ డ్యామేజ్‌ను సరిచేస్తుంది. తద్వారా లంగ్స్ క్లీన్ అయ్యి హెల్దీగా మారతాయి.
గ్రీన్ టీ
రిచ్ యాంటీ యాక్సిడెంట్స్ ఉండే గ్రీన్ టీ ని రోజూ తాగడం వల్ల లంగ్స్ డీటాక్స్ అయ్యి హెల్దీగా మారతాయి. ఇంఫ్లమేషన్ తగ్గి రెస్పిరేటరీ హెల్త్ మెరుగుపడుతుంది.
బెర్రీస్
బెర్రీ పండ్లలో ఉండే ఆంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కణాల డ్యామేజ్‌ను రిపేర్ చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే కాంపౌండ్.. యాంటీ మైక్రోబయల్‌గా పనిచేస్తుంది. ఇది లంగ్స్‌ను క్లీన్ చేసి లంగ్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
ఇవి కూడా..
ఊపిరితిత్తులు స్వయంగా డీటాక్స్ అయ్యే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి స్మోకింగ్, పొల్యూషన్ వంటివాటికి దూరంగా ఉంటూ తగిన ఫుడ్స్ తీసుకోవడం ద్వారా లంగ్స్‌ను తిరిగి హెల్దీగా మార్చుకోవచ్చు.