హైదరాబాద్ టు మైసూర్, ఊటీ టూర్! ప్యాకేజీ వివరాలివే

సమ్మర్ టూర్
సమ్మర్ హాలిడేస్‌లో ఊటీ టూర్ వెళ్లాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం ఓ స్పెషల్ టూర్ ఆఫర్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, మైసూరు, ఊటీ ప్రాంతాలను కవర్ చేసేలా బస్సు టూర్ రెడీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
వన్ వీక్ టూర్
తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న ఊటీ టూర్.. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఊటీ అందాలతో పాటు బెంగళూరు, మైసూరులోని టూరిస్ట్ స్పాట్స్ కవర్ చేయొచ్చు.
మ్యాప్ ఇలా..
హైదరాబాద్‌లో వోల్వో ఏసీ బస్సు ఎక్కడంతో టూర్ మొదలవుతుంది. రాత్రంతా జర్నీ చేసి.. రెండో రోజు ఉదయం బెంగళూరుకి చేరుకుంటారు. లోకల్ టూరిస్ట్ స్పాట్స్ చూసి రాత్రికి బెంగళూరులో స్టే చేస్తారు.
ఊటీ అందాలు
మూడో రోజు బెంగళూరు నుంచి బయల్దేరి ఊటీ వెళ్తారు. అక్కడ బొటానికల్ గార్డెన్స్, బృందావన్ గార్డెన్స్, హౌజ్ బోటింగ్ వంటి చూసుకుని రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
మైసూర్ ప్యాలెస్
నాలుగో రోజు సాయంత్రానికి ఊటీ నుంచి మైసూర్ చేరుకుని అక్కడ బృందావన్ గార్డెన్స్ చూసుకుని హోటల్‌లో స్టే చేస్తారు. ఐదో రోజు చాముండేశ్వరి టెంపుల్, బుల్ టెంపుల్, మైసూర్ ప్యాలెస్ వంటివి కవర్ చేస్తారు.
ప్రతీ సోమవారం
ఐదో రోజు సాయంత్రం రిటర్న్ బస్ ఎక్కి ఆరో రోజు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రతీ సోమవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.